ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా అన్ని దుకాణాలు మూసివేసిన సంగతి తెలిసిన విషయమే. దీనితో దొంగలు, దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. కరోనా కారణంగా షాపులు, అనేక సంస్థలు మూతపడటంతో ఇదే అదునుగా దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. అయితే తాజాగా దొంగలు గోల్డ్ ఫ్యాక్టరీలో చొరబడి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని వజ్రాలను ఎత్తుక వెళ్ళిపోయారు. వీళ్ళు ఏకంగా ఫ్యాక్టరీ పైకప్పుని తొలగించి లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న బంగారాన్ని అంతా వెళ్ళిపోయారు. వీళ్లు ఎంత పకడ్బందీగా చేశారు అంటే ఎటువంటి ఆధారాలు దొరక్కుండా చివరకు సీసీటీవీ ఫుటేజ్ క్యాసెట్లను సైతం తీసుకెళ్లిపోయారు.

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో ముంబైలో ఉన్న అంధేరి ప్రాంతంలో జరిగింది. ఆ ఏరియాలో ఉంటున్న నీరజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలో ఇలా చోటుచేసుకుంది. అక్కడ ఏకంగా సుమారు ఎనిమిది కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, అలాగే వజ్రాలను ఎత్తుకెళ్లి పోయారు దొంగలు. వారు ఫ్యాక్టరీ పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించి బంగారు నగలు తయారు చేసే మిషన్ నుంచి వచ్చే బంగారు దూలిని కూడా తుడిచిపెట్టి వేశారు.

 


ఫ్యాక్టరీలోని విలువైన వస్తువులను ఒకసారి చూసేందుకు వచ్చిన యజమాని షట్టర్లు తీసి లోపలికి వచ్చి చూడగా షాక్ కు గురయ్యాడు. ఫ్యాక్టరీలో అమాంతం భారీ చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. అంతటితో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి గురైన వస్తువులపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దొంగలు బంగారు లాకర్ ని గ్యాస్ కట్టర్ సాయంతో కట్ చేసి దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తో పథకం పొంది ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలుపుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: