కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రస్థాయిలో తప్పుపట్టిన ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కి గట్టిగా వార్నింగ్ పడినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్నా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఏపీ బీజేపీ లో టాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ రాపిడి టెస్టింగ్ కిట్లు కొనుగోలు లో అవినీతికి పాల్పడిందని విమర్శలు చేశారు. అదే టైం లో వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇవ్వటంతో కన్నా లక్ష్మీనారాయణ మరియు వైసీపీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ఒకపక్క కేంద్రంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరోనా వైరస్ కట్టడి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు గురించి అభినందిస్తున్న సందర్భంలో ఎటువంటి ఆధారాలు లేకుండా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ పై విమర్శలు చేయటం పెను దుమారాన్ని రేపింది. దేశానికి సంబంధించి కీలక విషయాల్లో కేంద్రంలో బీజేపీ కి చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తూ స్నేహంగా మెలుగుతున్న వైసిపి పై ఒక్కసారిగా కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడంతో  బీజేపీ హైకమాండ్ నేతలు కూడా షాక్ తిన్నారట.

 

అయితే ఈ విషయంలో ముందు నుండి కన్నా వెనకాల చంద్రబాబు ఉన్నారని చెప్పటంతో వెంటనే బీజేపీ హైకమాండ్...రంగంలోకి దిగి కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే కాదు ఎవరైనా ఏపీ బిజెపి నేతలు టిడిపి పార్టీ తో గాని చంద్రబాబుతో కానీ కలిసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు సృష్టిస్తే, విషయం వేరే లాగా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ఇదే టైమ్ లో ఏపీ బిజెపి అధ్యక్ష పదవిని వేరొక వ్యక్తి కి ఇవ్వటానికి బీజేపీ హైకమాండ్ రెడీ అవుతున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: