ఏపీలో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి అరికట్టడానికి  సీఎం జగన్ తీవ్ర కృషి చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచారు.  ప్రతి 10 లక్షల జనాభాకు 1274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. అటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారికి రూ.2 వేలు ఇస్తున్నారు.

 

అయితే జగన్ ఎంత చేస్తున్న టీడీపీ నేతలు మాత్రం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీ నేతలు పలు సమస్యలు ఎత్తి చూపుతూ, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు ఆ సమస్యలని పాయింట్ ఔట్ చేయకముందే, జగన్ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు పొగాకు రైతులని ఆదుకోవాలని లేఖలు రాశారు.

 

అయితే అప్పటికే జగన్ పొగాకు రైతులని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. ప్రకాశం జిల్లాల్లో పోగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున టంగుటూరు, కొండెపిల్లో ప్రత్యామ్నాయ వేలంపాట కేంద్రాల ఏర్పాటు చేయాలని, అలాగే పశ్చిమగోదావరి  జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం వేలంపాట కేంద్రాలు నిర్వహించాలని చెప్పారు.

 

అదేవిధంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, మత్యకారులని మన రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే జగన్ గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్య్సకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం మొదలుపెట్టారు. రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలని కూడా ఆదుకోవాలని కోరారు. మొత్తం మీదైతే టీడీపీ నేతలు ఏ సమస్య మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, దానిపై జగన్ ఆల్రెడీ యాక్షన్ లో దిగేసి ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: