కరోనా వైరస్ కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాలు వలన ఏ మాత్రం దేశంలో కరోనా కంట్రోల్ అయిన సందర్భాలు లేవు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసహనం నెలకొంటుంది. ఎన్ని రోజులని డబ్బులు లేక జీతాలు లేక ఉద్యోగాలు చేసుకోకుండా ఇంటిలో ఖాళీగా పస్తులు ఉండాలని జనాలు ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. చాలా మంది ప్రజలు మానసిక సంకోచానికి గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే మరో రెండు నెలల వరకు కరోనా వైరస్ అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు అన్నట్టు ఉంది. ఒక్కసారిగా ప్రజలలోనుండి అసహనం మొదలై ప్రభుత్వాలపై విరుచుకుపడితే మాత్రం సమాజంలో వినాశనం ఏర్పడుతుందని అంటున్నారు.

 

రాబోయే రోజుల్లో ఉద్యోగాలు లేకపోతే, సమాజంలో దారి దోపిడీలు, దొంగతనాలు ఇటువంటి వాటికి ప్రజలు అలవాటు పడే పరిస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు అసలు కరోనా వైరస్ పక్కనే ఉన్న చైనాలో అంత దారుణంగా విజృంభిస్తున్న సమయంలో అన్ని విమానాశ్రయాలు మూసి వేయకుండా మోడీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క కరోనా దేశంలో విజృంభిస్తున్న సమయంలో ఢిల్లీలో మత ప్రార్థనలకు కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

 

అన్ని తప్పులు మోడీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఇళ్లల్లో పెట్టడమేమిటని ప్రజలంతా అసహనం చెందుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో, లాక్ డౌన్ ఎత్తివేస్తే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదైతే, ప్రజలు భారీ స్థాయిలో ఊహించని రీతి గా చనిపోతే మోడీ చేతిలో నుంచి గవర్నమెంట్ జారిపోవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: