క‌రోనా క‌ల‌కలం ఇప్పుడు అన్ని దేశాల‌ను వ‌ణికిస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. దాదాపు అన్ని దేశాల‌కు క‌రోనా వైర‌స్ విస్త‌రించింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఊహించ‌ని ప‌రిణామాలు సైతం జ‌రుగుతున్నాయి. ఇందులో కొన్ని చిత్రాలు, వింతలు కూడా ఉన్నాయి. కోవిడ్‌-19 వైర‌స్‌కు పుట్టినిల్ల‌యిన చైనాలోని ఉహాన్ న‌గ‌రం ఆ వైర‌స్ బారి నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డింది. ఆదివారం చివ‌రి క‌రోనా రోగిని ద‌వాఖాన నుంచి డిస్‌చార్చి చేసిన‌ట్లు చైనా ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌క్కువ న‌మోదైన దేశాల లిస్టులో అల్జీరియా ఉండగా..అక్క‌డ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. 

 

ఉహాన్ న‌గ‌రంలో క‌రోనా కేసులు జీవో అని నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ప్ర‌తినిధి మి ఫెంగ్ తెలిపారు. ఈ న‌గ‌రంలో 46452 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు చైనా గ‌తంలో ప్ర‌కటించింది. వారిలో 3869 మంది మ‌ర‌ణించారు. చైనాలో న‌మోదైన మొత్తం కేసుల్లో ఈ న‌గ‌రంలోనే 56శాతం ఉన్నాయి. 

 

కాగా, అల్జీరియాలో మొదటి కేసు ఫిబ్రవరి 25న నమోదైన‌..మ‌ధ్య‌లో పెద్ద‌గా దీని ప్ర‌భావం చూపించ‌లేదు. మధ్యలో తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో వ్యాప్తిని నివారించడానికి, అల్జీరియన్ ప్రభుత్వం ఏప్రిల్ 29 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించ‌గా..కేసుల తీవ్రత తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను మరో 15 రోజులు పొడిగించేందుకు సిద్ద‌మ‌వుతోంది.అల్జిరీయాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 129 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో, మొత్తం కేసుల‌ సంఖ్య 3,256 కు పెరిగింది. అలాగే కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మరణాల సంఖ్య మొత్తం 419 కు పెరిగింది.

 

 

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 29 లక్షల 20 వేల 961కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 18 లక్షల 80 వేల 748గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు 2 లక్షల 3 వేల 272 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి 8 లక్షల 36 వేల 941 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కోవిడ్‌-19 కారణంగా అత్యధికంగా 54,256 మంది చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: