లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం వల్లే  కరోనా  ను కట్టడి చేయగలం అని బలంగా నమ్మే  వ్యక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. ఈవిషయాన్ని ఇప్పటికే పలు మార్లు ఆయన ప్రెస్ మీట్ లలో కూడా చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు రెండు సార్లు  లాక్ డౌన్ ను పొడిగించారు.  మే 3 తో దేశ వ్యాప్తంగా విధించిన  లాక్ డౌన్ ముగియనుండగా  తెలంగాణ లో మాత్రం మే 7వరకు  కొనసాగనుంది. అయితే ఆ తరువాత కూడా లాక్ డౌన్ ను పొడిగించే యోచనలోనే  కేసీఆర్ వున్నారని తెలుస్తుంది. 
 
గత మూడు రోజుల నుండి తెలంగాణ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇక ఈరోజు  సీఎస్ సోమేశ్ కుమార్ అలాగే ముఖ్య అధికారులతో  రాష్ట్రంలో  కరోనా పరిస్థితి దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి సీఎం  సుదీర్ఘంగా  సమీక్ష జరిపారు. అందులో భాగంగా  కేసులు తగ్గుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్ .. లాక్ డౌన్ వల్లే  ఇది సాధ్యమైందని మరి కొన్ని రోజులు ప్రజలు పూర్తిగా సహకరించాలని అన్నట్లు తెలుస్తుంది. అలాగే రేపు దేశ ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దాంతో దేశంలో  కరోనా  ప్రభావం ఏ స్థాయిలో ఉందో అంచనా వస్తుందని దాని తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కేసీఆర్ అన్నారు. 
 
సో కేసీఆర్ మరో సారి లాక్ డౌన్ ను పొడిగించడం తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లే.  ఒకవేళ పొడిగిస్తే  ఏమైనా మినహాయింపులు ఇస్తారా లేక మళ్ళీ సడలింపులు ఏమి లేకుండానే  కఠినంగా అమలు చేస్తారో అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక రేపు  దేశ వ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: