గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని టార్గెట్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవా ఉన్న టైంలో పొత్తు పెట్టుకునే అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల టైంలో మోడీ పై వ్యతిరేకత ఉండటంతో దేశవ్యాప్తంగా కూడా అదే స్థాయిలో కొద్దిగా కనబడటం తో వెంటనే చంద్రబాబు ఎన్నికలకు ముందు మోడీ తో విభేదించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కూటమి నుండి బయటకు వచ్చేశారు. ఏకంగా ఢిల్లీలోనే మోడీకి వ్యతిరేకంగా దీక్షలు ధర్నాలు చేయడం జరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

 

తీరా ఎన్నికలు వచ్చాక ఫలితాలు వెల్లడి అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇదే టైమ్ లో కేంద్రంలో బీజేపీ బలంగా గెలవటం రాష్ట్రంలో జగన్ కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం తో చంద్రబాబుకి మైండ్ పోయినట్టయింది. అప్పటినుండి ఇప్పటివరకు మోడీతో ఏదో విధంగా మళ్లీ టచ్ లోకి రావటానికి అనేక ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు. తాజాగా ఇటీవల కరోనా వైరస్ వల్ల ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి తనకి మరియు మోడీ మధ్య విభేదాలు తొలగిపోయాయి అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ గురించి మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా మోడీ జపం చేస్తూ అదో తపస్సు లాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

 

ఒకానొక సమయంలో ఎంతో మంది నాయకులను రాష్ట్ర‌ప‌తుల‌ను త‌యారు చేశాన‌ని చెప్పుకునే చంద్రబాబు ప్రధాని నుంచి ఫోన్ వచ్చిందని గంతులు వేసుకున్నట్టు గా చెప్పుకునే విధానాన్ని చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా చంద్రబాబు దిగజారి పోయే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని కొంతమంది సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ నాయకులతో మాట్లాడిన సందర్భంలో ఎక్కువగా మోడీ గురించి మాత్రమే మాట్లాడారు అని  పార్టీలో టాక్. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబు పూర్తిగా మోడీ తపస్సులో మునిగి పోయారు అని తెలుగుదేశం పార్టీలో ఏపీ రాజకీయాల్లో టాక్ బలంగా వినబడుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: