జనాలు మీకు అసలు ఇలా జరగాల్సిందేలే... ఎన్ని సార్లు చెప్పాము.. ఎంతమంది చెప్పాము.. జాగ్రత్తలు పాటించండి అయ్యా.. స్వామి అని నెత్తి నోరు మొదుకొని మరి చెప్పం.. సైబర్ నేరగాళ్లు చాలా నేరాలకు పాల్పడుతున్నారు.. మీరు కాస్త జాగ్రత్తలు పాటించండి అని చెప్పం.. కానీ విన్నారా? లేదే! ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తున్నాడు. ఇంకా అందుకే మోసపోతున్నారు. 

 

ఇప్పుడు తాజాగా ఒకరు మోసపోయారు.. ఎంత ఘోరంగా అంటే.. ఫ్రీగా చేసే కేవైసి పేరుతో లక్ష రూపాయిలు దొబ్బేశారు... సారీ సారీ.. కొట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ అనే వ్యక్తి మోసపోయి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేవైసీ అప్‌డేట్‌ అంటూ అతనికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు అని చెప్పారు. 

 

ఫోన్ లో వ్యక్తి చెప్పినట్టే కేవైసి కోసం యాప్ డౌన్లోడ్ చేసి అతని ఖాతా వివరాలను బాధితుడు నమోదు చేశాడు.. అంతేకాదు.. మొబైల్ కి వచ్చిన ఓటీపీ సైతం అతను చెప్పేశాడు.. దీంతో అతడి ఖాతాలో ఉండే 1. 9లక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకెళ్లారు.. ఇంకా ఆ డబ్బులు అన్ని ఖాతాలో లేవని గుర్తించిన రమేష్ మోసపోయానని గ్రహించాడు.. 

 

దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. చూశారా.. మన నిర్లక్ష్యం వల్ల.. మనం రాత్రి పగుళ్లు పని చేసి కష్టపడినా సొమ్ముని ఒకే ఒక ఫోన్ కాల్ తో దోచుకెళ్లి.. ఆ డబ్బు కోసం మళ్లీ పోలీసులు చుట్టూ తిరిగేలా చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు.. అందుకే ముందు జాగ్రత్తలు పాటించండి.. మీ వ్యక్తిగత సమాచారం ఎవరికి చెప్పకండి.                       

మరింత సమాచారం తెలుసుకోండి: