కరోనా దెబ్బకి ఇప్పటికే ప్రపంచం మొత్తం అచేతనావస్తలోకి వెళ్ళిపోయింది. ఎప్పటి వరకూ ఇళ్ళలో ఉండాలో తెలియదు..పోనీ బయటకి వచ్చి రోజు వారి పనులు చేసుకుందామా అంటే ఎక్కడ ఏ మూల దాక్కుని కరోనా కాచుకుని కూర్చుందో నని  ప్రజలందరూ ప్రాణాలు అరిచేత పట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ క్రమంలోనే మరొక పిడుగులాంటి వార్త తెలిపారు శాస్త్రవేత్తలు..కరోనాని మించిన భయంకరమైన వ్యాధి మరొకటి రాబోతోందా..లెక్కకి మించిన భయంకరమైన వైరస్ లు ప్రపంచ మీద దాడి చేయడానికి సిద్దంగా ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు..

IHG

రోజు రోజుకి మానవ స్వార్ధానికి వేడెక్కి పోతున్న భూమి అందుకు బదులు ఇవ్వడానికి సిద్దంగా ఉందట. వేడెక్కుతున్న భూమి మరో కొన్ని  భయంకరమైన వైరస్ లు ప్రభలడానికి కారణం అవుతోందట. 4 ఏళ్ళ క్రితం యూరప్ ని ఓ హీట్ వేవ్ బలంగా డీ కొట్టింది. ఈ ప్రభావంతో ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన మంచు కాస్తా కరిగిపోయింది. దాంతో మంచులో గడ్డకట్టి ఉన్న బ్యాక్టీరియా ఊపిరి పోసుకుంది. ఈ ప్రభావంతోనే ఆంత్రాక్స్ వ్యాప్తి చెందింది..ఈ వైరస్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో అందరికి తెలిసిందే...ఈ క్రమంలోనే

IHG

ప్రస్తుతం ఆర్కిటిక్ లో భూమి వేడెక్కుతోంది ఎంతగా అన్ని దేశాలతో పోల్చితే రెట్టింపు స్థాయిలో ఆర్కిటిక్ మండిపోతోంది. దాంతో అక్కడి మంచు కరగడం ప్రారంభిస్తే వేల ఏళ్ళుగా గడ్డకటిన బ్యాక్టీరియా మళ్ళీ పురుడు పోసుకోవడానికి సిద్దంగా ఉన్నాయట. చిన్న చిన్న వైరస్ లకి అయితే మందు ఉంది..కానీ కరోనలాంటి పెద్ద వైరస్ దాడి చేస్తే మనం ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుచుకుంటేనే కంగారు పెట్టిస్తుంది. ఈ పరిస్తితులపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందని కానీ భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పుని ఎదుర్కోవాలంటే తప్పకుండా భూతాపాన్ని తగ్గించడం మినహా మరో పద్దతి లేదని అంటున్నారు నిపుణులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: