సమాజంలో ఉన్న మనుషుల్లో ఐక్యత అనేది చాలా వరకు లోపించిందనడాని ఈ ఘటనే ఉదాహరణ.. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరి ప్రాణానికి గ్యారంటీ లేదు.. ఇక ముందు ముందు కూడా పరిస్దితులు ఎలా మారుతాయో అంచన వేయడం చాలా కష్టం.. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో మనిషికి మనిషి సహాయంగా ఉండాలి గానీ.. కక్షలు, కోపాలు, పగలు.. పెట్టుకుని జీవిస్తే ఆ బ్రతుకు కుక్కకంటే హీనమైనది.. ఏ క్షణం, ఎటువైపు నుండి మరణం అనే రక్కసి వచ్చి తీసుకుపోతుందో తెలియని రోజుల్లో బ్రతుకుతున్న ఈ సమయంలో కూడా ఒక మంచిపని చేయస్తున్న స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్న వివాదం.. ఆలోచనను పూర్తిగా నశింపచేసి ఆ మనిషిని మృగంగా మార్చి.. ఒక ప్రాణం పోవడానికి మూల కారణం అయింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

కరోనా వైరస్ ప్రాణాలు తీస్తున్న సమయంలో ఆ స్నేహితులంతా కలిసికట్టుగా ఉండి..పేదలను ఆదుకోవాలనుకున్న ఆశయంతో ముందుకు కదిలారు.. అందరు కలసి డబ్బులు పోగేసి, ప్రతి రోజూ పేదలకు ఆహారం అందిస్తున్నారు.. ఇలా ఒకే కాలనీలో నివాసముంటున్న స్నేహితుల మధ్య డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. ఇకపోతే ఈ ఘటన కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. స్దానికంగా ఉంటున్న 10వ తరగతి చదివిన విద్యార్థి(16).. అదే కాలనీకి చెందిన మరో యువకుడు ప్రవీణ్‌(25) స్నేహితులు. వీరితో పాటుగా మిగతా స్నేహితులంతా తాము పోగు చేసిన డబ్బుతో ఆహారం తయారు చేయించి.. ప్రతి రోజు 120 ప్యాకెట్లు పేదలకు పంపిణీ చేసేవారు. ఇందుకు గాను ఓ కిరాణా వ్యాపారి సహాయమూ తీసుకున్నారు.

 

 

అయితే డబ్బు విషయంలో ఈ ఇద్దరి మిత్రుల మధ్య శనివారం రాత్రి గొడవ జరిగగా, అందులో పదో తరగతి విద్యార్థి, అందరి ముందు ప్రవీణ్‌పై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనను తీరని అవమానంగా భావించిన  ప్రవీణ్ విచక్షణ కోల్పోయి.. ఇంటికెళ్లి కత్తితో ఆ విద్యార్ధి దగ్గరకు బయలుదేరాడు. అదే సమయంలో ప్రవీణ్‌కు ఆ విద్యార్థి ఇంటికెళ్తూ  కనిపించాడు. వెంటనే ప్రవీణ్ అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆ పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు.. ఒక మంచిపని చేయబోయిన ఈ స్నేహితులు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.. ఒకరి ప్రాణం పోయింది.. అందుకే మనిషికి ఓపిక అనేది చాలా ముఖ్యం అని చెబుతారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: