ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా రక్కసి దేశంలో తన విళయతాండవాన్ని కొనసాగిస్తూనే ఉంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగిపోవడంతో 27 వేల సంఖ్యకు అతి చేరువలో భారత్ ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనంలో రోజురోజుకు పెరిగిపోతున్న పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్ ఒక విధంగా మంచిని చేస్తే మరొక విధంగా మానవ జాతి పురోగతికి అంతరాయం కలిగిస్తుంది అంటూ ప్రముఖ సైకాలిజిస్ట్ డేవిడ్ మర్ఫీ మార్టిన్ సెలిగ్మాన్ విశ్లేషణ ఇప్పుడు అందరి మధ్య హాట్ టాపిక్ గా మారింది.


‘జరిగేది అంతామంచికనీ అనుకోవడమే మనిషిపని’ అంటూ మనసు కవి ఆత్రేయ వ్రాసిన పాటలోని భావాలకు అనుగుణంగా ప్రపంచంలోని నేటియువత మారిపోతుందని దీనివల్ల ప్రపంచానికి ఒక విధంగా నష్టం అంటూ ఆ మానసిక శాస్త్రవేత్త సంకేతాలు ఇస్తున్నారు. ఒక సూక్ష్మ జీవికి దడిచి బయటకు రావడానికి భయపడిపోతు ఇంటిలోనే నెలలు తరపడి ఉండిపోవడంతో యువతలో ఓపిక సహనం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ లక్షణాలు వారిని మానసికంగా ధృఢoగా చేసే విషయంలో సహకరించినా భవిష్యత్ లో నేటియువతకు అవసరమైన పోటీతత్వం నుండి ఈ కరోనా అనుభవాలు దూరం చేస్తుందా అనే సందేహాలు కూడ కలుగుతాయని డేవిడ్ తన విశ్లేషణలో పేర్కొన్నాడు. 


ఇప్పటి వరకు తమకు తెలియని తమ బలాల గురించి తెలుసుకోవడం పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్ లక్షణమని అయితే తమకు తెలియని బలాలను ఇప్పుడు ఖాళీగా ఉంటూ విశ్లేషించుకుంటున్న యువతలో తమకు తెలియకుండానే తమలో పెరిగిపోతున్న వేదాంత ధోరణిని గుర్తించలేకపోతున్నారు అంటూ గత 30 సంవత్సరాలుగా క్లినికల్ సైకాలిజిస్ట్ గా పేరుగాంచిన మార్టిన్ సెలిగ్మాన్ అభిప్రాయం. అయితే సవాళ్లు ఎదురైనప్పుడు మాత్రమే మనం ఎదగ గలం అన్నది వాస్తవమే అయినా ప్రస్తుతం అందరిలో ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం తెలియాలి అంటే కనీసం ఒక సంవత్సరం వేచి చూడాలి అని ఈ మానసిక శాస్త్రవేత్త అభిప్రాయపడుతున్నారు..   

మరింత సమాచారం తెలుసుకోండి: