కరుణ వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో చాలా మంది కరోనా వైరస్ పేరెత్తితేనే భయపడిపోతున్నారు. ఇక ప్రజలు కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారి బారినపడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంత మంది నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. అవగాహనా లేమి నిర్లక్ష్యం వెరసి రోజురోజుకు కరోనా  వైరస్ ఒకరి నుండి ఒకరికి శరవేగంగా వ్యాప్తి చెంది వైరస్  బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతూనే ఉంది. విజయవాడలో ప్రస్తుతం రోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా మరో 60 మంది కరోనా  వైరస్ బారిన పడడం అక్కడి ప్రజలు మరింత భయాందోళనకు గురిచేస్తోంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కృష్ణ లంక కు చెందిన ఓ లారీ డ్రైవర్ కారణంగా 24 మందికి కరోనా  సోకితే... కార్మిక నగర్ కు చెందిన యువకుడు వల్ల మరో 36 మందిని ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే విజయవాడలో 47 కొత్త కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా కార్మిక నగర్ లో 20, కృష్ణలంకలో 7,  గాంధీ నగర్ లో ఐదు నమోదయ్యాయి. ఇక మిగిలిన 14 కేసులు విజయవాడ లోని పలు ప్రాంతాలలో నమోదయ్యాయి. అయితే కృష్ణలంకలో నమోదైన ఏడు కేసులు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరికి వైరస్ ఎలా సోకింది అంటే ఓ వృద్ధురాలు అంత్యక్రియల్లో  పాల్గొనడం కారణంగా ఏకంగా ఏడుగురు  వైరస్ బారిన పడ్డారు. 

 

 

 ఇక కొత్తగా నమోదైన కేసులు ఎవరి నుంచి ఎవరికి కరోనా సోకింది అని కూడా తెలుసు లేకపోతున్నారు అధికారులు. రోజురోజుకు విజయవాడలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం అధికారులు ప్రజలు మరింత భయాందోళనలు కలిగిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ లోని చాలా ప్రాంతాలను రెడ్ జోన్ లుగా  ప్రకటించారు అధికారులు. ఇక విజయవాడ లో నమోదైన కేసుల కైతే కాంటాక్ట్ తేలకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశంగా అధికారులు భావిస్తున్నారు. ఇక కొంతమంది స్థానిక నాయకులు నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రాంతాలకు కొత్తవారిని ఎవరినీ అనుమతించకుండా అడ్డుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: