ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ప్రతిరోజూ 50కి పైగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు 80 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రకటన వెలువడింది. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,177కు చేరింది. 
 
ఈరోజు నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 33 కేసులు, గుంటూరులో 23 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రభుత్వం కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు మూడో విడత ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. ఉపాధి లేని పేదలు ఆకలితో బాధ పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసింది. 
 
ప్రభుత్వం మూడో విడత రేషన్ సరుకుల్లో భాగంగా బియ్యం, కంది బేడలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో దుకాణం పరిధిలో 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకెన్లు ఇచ్చి పంపిణీ చేయనుంది. లబ్ధిదారుల బయోమెట్రిక్ ద్వారా ప్రభుత్వం రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రేషన్ షాపుల దగ్గర శానిటైజర్, మాస్కులు కూడా ఉపయోగించుకోవాలి. 
 
ప్రతి లబ్ధిదారుడు శానిటైజర్ లో చేతులు శుభ్రం చేసుకునే విధంగా డీలర్లు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. సీఎం జగన్ రాష్ట్రంలో బియ్యం కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో 70,000 కుటుంబాలకు అదనంగా లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: