ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పాకిస్తాన్ మాత్రం తన పాడు బుద్ధి మాత్రం వదులుకోలేదు. ఒకవైపు పాకిస్థాన్ లో మరోవైపు భారత్ లో రెండు దేశాల్లో కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుంది అన్న విషయం పక్కన పెట్టి భారత సైన్యంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరపడం జరిగింది. 

 

అయితే ఇక అసలు విషయానికి వస్తే.. నిజానికి పాకిస్తాన్ ముష్కరులను ఎదుర్కోవడంలో విజయం సాధించిందని చెప్పవచ్చు. గత ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో మొత్తం నలుగురు పాకిస్తాన్ ముష్కరులు మరణించారు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వస్తే... దక్షిణ కాశ్మీర్ లో కుల్గామ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారత సైనికులు నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించడంలో విజయం సాధించారు. ఇందులో రాష్ట్రీయ రైఫిల్స్ (RR), స్థానిక పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి..

 

అయితే ఈ కాల్పుల సంఘటనల్లో భారత్ సైన్యం నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే ఇందులో ఒక భారత సైన్యానికి బుల్లెట్ తగలడంతో గాయం అయింది. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పాకిస్థాన్ ఇలాంటి పడు పనులు చేయడం ఆ దేశ నీచ బుద్ది బయట పడుతుంది. ఒక వైపు పాక్ కరోనా నేపధ్యంలో భారత్ ను సహాయం కోరుతుండగా మరోవైపు ఇలాంటి దుశ్చర్యలకు పాలపడుతుంది. 


మరోవైపు, పంజాబ్ రాష్ట్రము‌లోని అమృత్ సర్ ‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఏకంగా రూ .25 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను ఇండియాలో పెద్ద దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులు విషయాన్నీ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: