ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడంతా కోవిడ్ క‌ల‌క‌ల‌మే. ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు ప‌రిశోధ‌న‌లు పెద్ద ఎత్తున్నే జ‌రుగుతున్నాయి. కోవిడ్‌19 నివార‌ణ‌కు వ్యాక్సిన్ తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం కోవిడ్‌19 వ్యాధి కోసం వ్యాక్సిన్ త‌యారీ చేసేందుకు సుమారు అర‌డ‌జ‌ను కంపెనీలు కృషి చేస్తున్నాయి. భార‌త్‌, అమెరికా కూడా క‌లిసి వ్యాక్సిన్ అభివృద్ధిపై ప‌నిచేస్తున్న‌ట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి రెండు దేశాలు వివిధ వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయని మైక్ అన్నారు. దీంతో భార‌త‌దేశంలోని ఏ కంపెనీ ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేయ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. 

 

ప్ర‌పంచంలో అత్య‌ధిక వ్యాక్సిన్లు త‌యారు చేసే కంపెనీ అయిన సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో  ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్‌తో క‌లిసి సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ వ్యాక్సిన్ త‌యారీలో ఈ కంపెనీ నిమ‌గ్న‌మైంది.  సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ కంపెనీ.. అమెరికాకు చెందిన కోడాజెన‌క్స్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌ర్చుకుం‌ది. ఈ రెండు సంస్థ‌లు లైవ్ అట్యునేటెడ్ వాక్సిన్‌ను త‌యారు చేస్తున్నాయి.  

 

సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్‌కు సుమారు 500 మిలియ‌న్ల డోస్‌లు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఉం‌ది. 53 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన‌ సీర‌మ్ కంపెనీ ప్ర‌తి ఏడాది 1.5 బిలియ‌న్ల వ్యాక్సిన్ డోస్‌ల‌ను త‌యారు చేస్తుంది. మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ఆ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు నెద‌ర్లాండ్స్‌, చెక్ రిప‌బ్లిక్‌లో ప్లాంట్స్ ఉన్నాయి. 165 దేశాల‌కు ఈ కంపెనీ సుమారు 20 టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తోంది.  80 శాతం వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నారు.

 


ఇదిలాఉండ‌గా,  కాగా, ప్ర‌స్తుత  దీంతో వైర‌స్‌ను పూర్తిగా చంప‌లేక‌పోయినా.. దాని హాని‌క‌ర ల‌క్ష‌ణాల‌ను మాత్రం చంపేయ‌గ‌ల‌దు. ఏప్రిల్‌లో జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సీరమ్ కంపెనీ సీఈవో తెలిపారు. గ‌త గురువారం నుంచి ఆక్స్‌ఫ‌ర్డ్‌లో హ్యూమ‌న్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. ఒక‌వేళ అన్నీ స‌జావుగా సాగితే, సెప్టెంబ‌ర్ క‌ల్లా సుమారు ప‌ది ల‌క్ష‌ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా, ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే భార‌త‌దేశం యొక్క స‌త్తా మ‌రోమారు ప్ర‌పంచం గుర్తించ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: