ఒకప్పుడు ఆయన స్టేజ్ పై ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేసేవారు.. మెజీషియన్ (ఇంద్రజాలికుడు) గా ఆయన ఎంతో మంది ప్రశంసలు పొందారు.  విధి వంచితులు అంటే ఇదే.. పూలు అమ్మిన చోటే.. కట్టెలు అమ్మడం అంటే ఇదే.  తన అద్భుతమైన ప్రదర్శనతో ఎంతో మందిని అబ్బురపరిచిన ఓ ఇంద్రజాలికుడు (మెజిషియన్ ) ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. రాజస్థాన్‌లో ఇది వెలుగు చూసింది.  దేశంలో కరోనా వైరస్ ప్రవేశంచిన తర్వాత ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు.  మాల్స్, థియేటర్లు ఒక్కటేమిటి అన్ని వ్యవస్థలు స్థంభించి పోయాయి.  వినోదానికి సంబంధించి ఏ ఒక్కటీ లేవు.. ఎంతటి  గొప్పవారైనా ఇంటి పట్టున ఉండాల్సిన రూల్స్ అమల్లోకి వచ్చాయి.

 

 కరోనా పై యుద్దం చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో  ప్రభుత్వాలు కేవలం నిత్యావసరాలు, కూారగాయలు అమ్ముకోవడానికి మాత్రమే  అనుమతి ఇవ్వడంతో మెజిషియన్ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  కాగా, కరోనా రక్కసి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతో ఉపాధి లేక ఇలా ఎంతో మంది కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. ప్రముఖ మెజీషియన్‌గా పేరుగాంచిన రాజు మహోర్ ఆర్జే సామ్రాట్ జాదూగర్ అనే పేరుతో ఎంతో పేరు సంపాధించాడు. తన మ్యాజిక్‌లతో ఎంతో మందిని కట్టిపడేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నాడు.

 

 ఆయన ఈ ఫీల్డ్ లో గత 15 సంవ్సరాలుగా కొనసాగుతున్నారు.. ఎంతో మంది శిష్యులను గొప్పవాళ్లుగా మలిచారు. కనీసం రోజుకు 10 వరకు షోలు నిర్వహించేవాడు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్  కారణంగా తన ఉపాధికి గండి పడింది. దీంతో అతనితో పాటు సుమారు 12 మందికి పూట గడవటం కష్టంగా మారింది. ఇక ధోల్ పూర్ జిల్లాలోని ఓ కూరగాయల మార్కెట్లో అతన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటని కొంత మంది ప్రశ్నించగా.. ఇంటి అద్దె, కుటుంబ పోషణకు ఇలా చేయడం తప్పడం లేదని అంటున్నారు ఫేమస్ జాదూగర్.

మరింత సమాచారం తెలుసుకోండి: