కరోనా ను కట్టడి చేయడంలో భాగంగా  భారతదేశంలో లాక్ డౌన్ విధించగా.. వైరస్ ప్రభావం మరింత పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  పొడిగించిన విషయం తెలిసిందే. మొదటి దశ లాక్ డౌట్ లోనే  ఎంతో ఇబ్బందులు పడిన ప్రజలు ఇక మరో సారి లాక్ డౌన్ విధించటంతో  కూలీలు వలస కార్మికులు అందరూ అయోమయంలో పడిపోయారు. అటు ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడం..ఇక్కడ ఉపాధి లేక బ్రతుకు దుర్భరం అవ్వటంతో...  ఎలాగైనా ఇంటికి వెళ్లలని కొంతమంది కాలినడకన వెళుతుంటే  ఇంకొంతమంది ఏదో విధంగా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఇక్కడ ఇద్దరు కూలీలు ఇంటికి వెళ్లడానికి సాహసం చేశారు అని చెప్పాలి . కూలి పనుల నిమిత్తం ఒడిషా నుంచి తెలంగాణకు వచ్చిన వలస జంట... లాక్ డౌన్ సమయంలో ఎలాంటి ఉపాధి లేక పోవడం ఇక్కడ జీవితాన్ని గడపడం రోజు రోజుకు మరింత భారంగా అవుతుండడంతో తమ స్వస్థలానికి చేరుకోవాలని  నిర్ణయించుకున్నారు  ఈ క్రమంలోనే సైకిల్ని ఆశ్రయించారు. 

 

 

 ఇక తొమ్మిది రోజుల కిందట తెలంగాణ నుంచి సైకిల్పై బయలుదేరిన ఈ జంట పోలీస్ చెక్ పోస్టులు సరిహద్దులు అన్ని  దాటుకుంటూ ఏప్రిల్ 25 నాటికి ఒడిశాలోని మల్కన్ గిరి  జిల్లాకు చేరుకున్నారు. మరి కొన్ని అడుగులు వేస్తే ఇంటికి చేరుకుంటాము అని ఎంతో ఆనంద పడిపోయారు. కానీ ఇంతలోనే అక్కడి పోలీసులు వీరిని తెలంగాణ నుంచి వస్తున్నారని గమనించి వారిని పట్టుకొని కు క్వారంటైన్ కి తరలించారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ వలస వచ్చిన ఈ కార్మికులు... లాక్ డౌన్  కారణంగా అక్కడ పనులేవీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలై  ఇంటికి వెళ్లాలని ఇలా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. 

 

 

 తమకు ఉపాధి చూపించిన కాంట్రాక్టర్ దగ్గర ఏడు వేల రూపాయలు అప్పుగా తీసుకుని ఐదు వేల రూపాయలు వెచ్చించి సైకిల్ కొనుక్కుని స్వగ్రామానికి బయలుదేరారట ఈ జంట . ఏకంగా రోడ్డు బాటన సైకిల్పై వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించారు... ఇక చివరికి మల్కన్ గిరి జిల్లా గోవిందపల్లి చేరుకోగా అక్కడ పోలీసులు వారిని అడ్డుకుని క్వారంటైన్ కి  తరలించారు. అప్పటి వరకు ఉన్న అన్ని  చెక్ పోస్ట్  ఉన్నప్పటికీ అన్ని చోట్ల పోలీసులు దాటుకొని ఎక్కడి వరకు  ఎలా వచ్చారు  అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలా చాలా మంది కార్మికులు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన లేదా సైకిల్ ప్రయాణం ద్వారా ఏకంగా  వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: