దేశంలో కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్  విధించి విదేశాల నుంచి ఎవరినీ అనుమతించకుండా దేశంలోని అన్ని రవాణా వ్యవస్థను మూసివేసి ప్రజలకు ఇంటికే పరిమితం అయ్యేలా చేసినప్పటికీ దేశంలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్  పొడిగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మే 3వ తేదీ చెరువులోకి వస్తున్నప్పటికీ ఇంకా  దేశంలో కరోనా వైరస్ కట్టడి మాత్రం జరగడం లేదు. 

 


 కరోనా  వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్  రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్ మరోసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి అనే వాదన గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. అయితే దేశంలో లాక్ కొనసాగించాలా వద్దా అనే దానిపై ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. తమ తమ రాష్ట్రాలలో కరోనా  వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో వెల్లడించారు. 

 


 ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్   పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్న తరుణంలో... రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా కొన్ని షరతులతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: