కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

 

 

 

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటికే 2 లక్షలకుపైగా మృతి చెందారు.  కాగా ఇంగ్లాండ్లో కరోనా కవలలను బలి తీసుకుంది.   ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో నర్సులుగా పనిచేస్తున్న 37 ఏళ్ల ఎమ్మా డెవిస్, కేటీ డెవిస్ అనే కవల సోదరీమణులు కరోనా బారిన పడ్డారు. దీంతో వారిని  సౌతాంఫ్టన్‌ జనరల్ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

 

 

 

 

 

 

అయితే కొద్ది రోజుల కిందట ఎమ్మా చనిపోగా... ఆమె చనిపోయిన నాలుగు రోజులకే కేటీ కూడా తుది శ్వాస విడిచింది. ఎమ్మాను స్మరిస్తూ ఆ ఆస్పత్రి సిబ్బంది చప్పట్లో నివాళులు అర్పించిన గంటలోనే కేటీ కూడా చనిపోవడం గమనార్హం. కాగా డెవిస్ కవలల మృతిపై వారి సోదరి జాయ్ స్పందిస్తూ... ఎమ్మా, కేటీలు ఒకరి కోసం ఒకరు జీవించేవాళ్లని ఇద్దరూ ఏ రోజు విడిపోయి జీవించలేదని తెలిపారు.  వారిని కరోనా మాత్రమే విడదీసిందని.. అలాగే అదే కరోనా  చివరికి ఇద్దరిని బలి తీసుకుందని ఆవేదనకు గురయ్యారు. తామిద్దరం ఈ ప్రపంచానికి కలిసే వచ్చాం. కలిసే వెళ్లిపోతామని ఎమ్మా, కేటీలు ఎప్పుడూ అనేవారని గుర్తు చేసారు. కవలలు చనిపోవడం వారి కుటుంబసభ్యులతో పాటు  తోటి వైద్య సిబ్బంది సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: