ప్రపంచాన్ని  అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్నందున తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. అందుకే.. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళ కుటుంబాలకు కూడా కరోనా పెరుగుతుంది..అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది..దీంతో ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను విధించింది.. ఇకపోతే కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు... 

 

 

 

 

 

లాక్ డౌన్ చర్యలు పకడ్బందీగా కొనసాగుతున్న కూడా కరోనా కేసులు మాత్రం ఎక్కడా తగ్గలేదు.. దీంతో ప్రభుత్వం కూడా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తుంది...ఈ మేరకు ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా ముందుకొస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది సినీ తారలు మాత్రం తమరి దయాగుణం  చూపించారు.. పేద ప్రజలకు విరాళాన్ని ప్రకటించడంతో పాటుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు..

 

 

 

 

 

 

కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఏప్రిల్ 27 మధ్యాహ్నం 1 వరకు ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలో 210 కరోనా పాసిటివ్ కేసులు నమోదయ్యాయి.  సోమవారం 33 కొత్త కేసులు బయటపడ్డాయి. జిల్లాలో కరోనా బారి నుంచి 29 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 173 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా 8 గురు మృతి చెందారు. 

 

 

 

 

జిల్లాలో జగ్గయ్యపేట, నూజివీడు, పెనమలూరు రెడ్ జోన్ లో ఉన్నాయి. రెడ్ జోన్ ఏరియాల్లో పోలీస్ అధికారులు  కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తున్నారు. కేసుల సంఖ్యలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా మంత్రులు పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఈ విపత్కర పరిస్థితిల్లో ప్రధాని మోదీ చెప్పినట్లు మే 3 వరకు ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉండాలని వన్ ఇండియా సైతం మిమ్మల్ని కోరుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: