జగన్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కానీ జగన్ పెదవి విప్పి మాట్లాడిందే తక్కువ. ఆయన పలుకే బంగారం అన్నట్లుగా ఉంటారు. మనను పాలించిన ముఖ్యమంత్రులలో జగన్ విభిన్నమైన వారుగా ఉంటారు. అంతకు ముందు హై కమాండ్ ఆదేశాలతో కుర్చీ ఎక్కిన వారు సైతం మాటలు కోటలు దాటించేవారు. అచ్చమైన ప్రజా నాయకులుగా దర్జా ఒలకబోసేవారు. 

 

కానీ అఖండమైన మెజారిటీతో గెలిచినా కూడా  జగన్ తీరు తీసుకుంటే పక్కా  సైలెంట్. తన పనేంటో తాను ఏంటో అన్నట్లుగా ఆయన ఉంటారు. జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడతారు అని అంటారు. అది నిజమేనని అధికారంలోకి వచ్చిన కొత్తల్లొనే నిరూపించారు. ఇక జగన్ కరోనా వంటి అతి పెద్ద సవాల్ ఎదురొచ్చిన వేళ కూడా తన హామీలను తుచ తప్పకుండా నెరవేర్చడం గొప్ప విషయమే కాదు. అభినందించాల్సిన విషయమే. 

 

మార్చి నెలలో చూస్తే రాష్ట్ర ఆదాయం పదిహేను వందలకోట్లు. అదే కంప్లీట్ లాక్ డౌన్ లో ఉన్న‌ ఏప్రిల్ నెలలో  చూస్తే రాష్ట్ర ఆదాయం కేవలం 76 కోట్లు మాత్రమే. ఇది ఏ మూలకు పనికివస్తుంది. ఏపీ లాంటి అయిదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఇంత సింగిల్ డిజిట్ నంబర్ తో పాలన చేయాలంటే ఎన్ని గుండెలు ఉండాలి. కానీ జగన్ మాత్రం చిరు నవ్వుతోనే పాలిస్తున్నాడు. నొప్పి జనాలకు తెలియనివ్వరాదని ఆయన పాటుపడుతున్నాడు.

 

లాక్ డౌన్ ఇబ్బందులో కూడా డ్వాక్రా మహిళలకు 1400 కోట్లతో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చాడు అంటే శభాష్ జగన్ అనాలి. అది ఆయన కమిట్మెంట్ అని కూడా చెప్పాలి. దీని మీద ఒక మంత్రికి డౌట్ వచ్చి ముఖ్యమంత్రి గారు ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఈ కష్ట కాలంలో కూడా స్కీములు అమలు చేస్తున్నారు. హామీలు తీరుస్తున్నారు అని అడిగారట. దానికి జగన్ చిరునవ్వే సమాధానం అయింది.

 

అంతే కాదు, జగన్ ఆ మంత్రితో అన్నారుట. మనం హామీ ఇచ్చాం, ఇపుడు కష్టం వచ్చిందని చెప్పి తప్పించుకుంటే ఎలా. అది ధర్మం కాదు అని, మరి ఇలాంటి కమిట్మెంట్ ఉండబట్టే జగన్ కి ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని వస్తున్నా కూడా పధకాలు సాఫీగా ప్రారభం అవుతున్నాయి. అటు రాజకీయంగా, ఇటు ప్రక్రుతిపరంగా, ఇంకోవైపు ఆర్ధికంగా కూడా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఏ ముఖ్యమంత్రీ కూడా ఇన్ని బాధలు అనుభవించలేదేమో. మొత్తానికి జగన్ గ్రేట్ అనాల్సిందే. ఎందుకంటే వీటికి తట్టుకుని నిలబ‌డుతున్నారు. అన్న మాటను నిలబెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: