టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్. నిజానికి ఈయనేం చేసినా కూడా నవ్వు తెప్పిస్తుంటుంది. సినిమాల్లో కామెడీ చేసినట్లు బయట కూడా ఆయన చేస్తుంటాడు బండ్ల. కొన్ని రోజలుగా ఈయన కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చెప్పినా కూడా ట్విట్టర్ ‌లో జై కొడుతున్నాడు బండ్ల గణేష్. ఇకపోతే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ ని చేశాడు. అందులో లో కొండ గణేష్ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే...

 

" అనుకున్న లక్ష్యం కోసం పుష్కర కాలం పోరాడి భారతదేశం నివ్వెర పోయే విధంగా తన తెలంగాణా సాధించి ఆరు సంవత్సరాలుగా అద్భుతం చేసి కోనసీమకు దీటుగా సస్యశ్యామలం చేస్తూ తన జన్మ సార్థకం చేసుకున్న నేతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు బండ్ల గణేష్ " అంటూ తెలంగాణ సీఎంఓ అని కేసీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చెసాసు బండ్ల గణేష్. 

IHG


అయితే ఈయనకు సినిమాలతో పాటు మరో వ్యాపారం కూడా బయట చేస్తున్నాడు. అది ఏదో కాదు ఫౌల్ట్రీ బిజినెస్. తెలంగాణలో ఫౌల్ట్రీ బిజినెస్ ను శాసించే స్థాయిలో ఉన్నాడు బండ్ల గణేష్. నిజానికి ఈయన బిజినెస్ రేంజ్ కూడా చాలా పెద్దదే. కరోనా వచ్చాక ఆ మధ్య ఒకసారి చికెన్ తింటే మంచిది.. శక్తి పెరుగుతుందని కేసీఆర్‌ చెప్పడంతో ఆయనకు ఏకంగా పాలభిషేకం చేసినంత పని చేసాడు బండ్ల గణేష్ .

మరింత సమాచారం తెలుసుకోండి: