ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి  జగన్ సర్కార్ కీలక చర్యలు చేపడుతూ  ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా  వైరస్ ప్రభావం ఎలా ఉంది అనే దానిపై పలు వివరాలను వెల్లడించారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ మహమ్మారి అయినా కరోనా  వైరస్ పై  పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో బెస్ట్ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

 

దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో చనిపోయిన వారి పర్సంటేజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2.38 శాతం మాత్రమే ఉంది అంటూ తెలిపారు . ఇక టెస్టులు నిర్వహించడం లోను  సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రాష్ట్రం కూడా అందుకోలేని  పరిస్థితి ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

 

 

 కరోనా టెస్టుల్లో జాతీయ స్థాయిలో సగటు 10 లక్షల జనాభాకు దేశంలో 451 టెస్టులు జరిగితే  .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సగటు 10 లక్షల జనాభాకు 1,396 జరిగాయని.. ఒక్కరోజులోనే 6517 టెస్టులు చేసుకునే స్థాయికి ప్రస్తుతం చేరుకున్నాము అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంటూ వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రంలో 75 వేల టెస్టులు  చేశామని వెల్లడించారు. 

 

 

 కరోనా  వైరస్ గురించి ప్రజలు అపోహలకు పోకూడదని అసత్య ప్రచారాలు నమ్మకూడదు అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం సూచిస్తున్న ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించి అందరూ లాక్ డౌన్  నిబంధనలు పాటిస్తే కరోనా ను  తప్పకుండా రాష్ట్రం నుంచి తరిమికొట్టగలమని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: