రాజకీయాల్లోనూ సినిమాల్లో జరిగినట్లుగా జరిగితే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. విలన్ తో పోరాడి హీరో అయిన తరువాత వెండి తెర మీద శుభం కార్డు పడుతుంది. అదే రియల్ లైఫ్ లో మాత్రం అసలు కధ అక్కడ నుంచే మొదలవుతుంది. అంతకు ముందు కూడా చూడని కష్టాలు మొదలవుతాయి. 

 

అయితే ఫ్యాన్స్ ఆశలు మాత్రం ఊరుకోవు. విలన్ని చితక్కొట్టమనే అంటారు. కానీ ఏలికలు అయిన తరువాత బాధ్యతలు కూడా ఉంటాయి. మొరటుగా బిహేవ్ చేయలేరు కదా. ఇక అది చూసుకునే నిన్నటి దాకా పరోక్ష పెత్తనం చేసిన వారు రెచ్చిపోతుంటారు. ఇక ఉమ్మడి ఏపీలో  పచ్చ మీడియా ప్రధాన బాధితుడు ఎవరు అంటే ఠక్కున మొదట చెప్పుకునే పేరు జగన్. ఆయన గురించి ఒక్క మంచి మాట గత పదేళ్ళలో పచ్చ మీడియాలో ఎక్కడా వచ్చింది లేదు.

 

ఇక జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని చిలక జోస్యాలు చెప్పిన పచ్చ మీడియా పెద్దలు ఇపుడు తన జన్మలోనే ఆయన సింహాసనం మీద ఉండడాన్ని చూస్తున్నారు. ఇపుడు జగన్ కాళ్ళలో పల్లేరు ముళ్ళు పెడుతూ శాడిజంతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు తెలంగాణాలో కేసీయార్ లా జగన్ కూడా ఉండాలని అంటున్నారు.

 

కేసీయార్ ఏకంగా మీడియా మీటింగులోనే ఓ పత్రికాధిపతికి కరోనా తగలాలని శాపం పెట్టేశారు. మరి ఏపీలో మాత్రం విచ్చలవిడిగా అసత్య వార్తలు, అబద్దపు రాతలతో బురద జల్లుతూంటే జగన్ ఏం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆవేదనగా ఉంది. కేసీయార్ మాదిరిగా గట్టి  వార్నింగు ఇవ్వొచ్చు కదా అన్ని అన్న  వారే ఇపుడు వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారని ప్రచారం సాగుతోంది.

 

వారూ వీరూ కాదు, అధికారులు సైతం ప్రభుత్వానికి ఇదే బాధను విన్నవించుకుంటున్నారు.  కరోనా వల్ల జనం ఇబ్బందులు పడుతూంటే అసత్యపు రాతలతో జనాన్ని భయపెడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ఎదుటే అధికారులు మొర పెట్టుకున్నారట. జగన్ మాత్రం వాటిని ఖండించండి అంటూ ఊరుకున్నారు తప్ప మరేమీ చేయడంలేదు. ఇక మంత్రులు కన్నబాబు, పేర్ని నాని వంటి వారు గట్టిగానే పచ్చ మీడియాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా జగన్ పెదవి విప్పడంలేదు.

 

మరి జగన్ మార్క్ పాలిటిక్స్, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందోనని సర్వత్రా చర్చగా ఉంది. కేసీయార్ ఇచ్చిన ఒకే ఒక్క వార్నింగు తో  అక్కడ సీన్ మొత్తం మారింది. పిచ్చి రాతలు, పచ్చ కూతలూ ఆగిపోయాయి. మొత్తానికి కేసీయార్కి  భయపడ్డట్టుగానే అక్కడి సీన్ ఉంది. మరి ఏపీ విషయంలో మాత్రం పచ్చ మీడియా పూనకం ఇంకా అలాగే ఉంది. ఆపద కాలంలో బాధ్యతగా లేని మీడియాకు షాక్  ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న మాట వినిపిస్తోంది. మరి జగన్ గట్టి దెబ్బ కొడతారా. పోనీలే అని ఎప్పటిమాదిరిగానే వదిలేస్తారా. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: