విజయసాయిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా ఇలాంటి విపత్కరమైన సమయంలో చేస్తున్న పోస్టులు వైఎస్ఆర్సిపి పార్టీ పై ప్రజలలో కొంత వ్యతిరేకతను కనబరుస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమే గాని ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ విషయమే గాని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా పెడుతున్న పోస్టులు ఆ పార్టీకే డ్యామేజ్ తెచ్చిపెడుతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి ఎక్కువ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవహరించడాన్ని నెటిజన్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే విజయసాయిరెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్....“బాబు పబ్లిసిటీ స్టంట్ల కైపులో మునిగి తేలిన టీడీపీ నేతలు, జగన్ గారు ఎటూ వెళ్లరా అని శోకాలు పెడుతున్నారు. అతనికి టాబ్లెట్ వేయండి, ఇతనికి టెంపరేచర్ చూడండి అని బాబులా డ్రామాలాడాలట! ప్రభుత్వ యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేస్తోంది. సిఎం గారు పర్యవేక్షిస్తున్నారు. కనిపించడం లేదా?. మీడియాలో కనిపించడం ఆత్మ సంతృప్తినిస్తుందేమో కానీ జనాల్లో సానుభూతి, అభిమానం పెరగడానికి మాత్రం పనికి రాదు. 80 శాతం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు గెల్చుకున్న అధికార పక్షం ప్రజల మధ్యన ఉంటూ, ఏడాది తిరగక ముందే హామీలన్నీ నెరవేరుస్తుంటే ఎల్లో మీడియాను పట్టుకుని ఊగులాడితే ఏమొస్తుంది?” అని రాసుకొచ్చారు.

 

దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ టైంలో రాజకీయాలపై పెట్టె దృష్టి బదులు కరోనా వైరస్ కట్టడి చేయడం పై దృష్టి పెడితే బాగుంటుందని సూచనలు ఇస్తున్నారు. మరోపక్క వైసీపీ అభిమానులు కూడా ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు  సరైనది కాదని అంటున్నారు. అనవసరమైన విషయాల కు వెళ్లి … సోషల్ మీడియాలో అవసరమైన పనులు చేస్తూ పోస్టులు పెడుతూ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: