పద్మ ప్రియ అనే ఓ 33 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు గత కొంతకాలం గా దగ్గు, జలుబు ఇంకా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. ఇవన్నీ కోవిడ్ 19 లక్షణాలు కావడం తో తనకు వైరస్ సోకిందో లేదో తెలుసుకోవాలని వైద్యాధికారులను ఆమె సంప్రదించగా... వాళ్ళు కింగ్ కోటి హాస్పటల్లో చెకప్ చేయించుకోవాలిసిందిగా సూచించారు. దాంతో ఆమె కింగ్ కోఠి ఆసుపత్రికి వెళ్లగా... అక్కడి సిబ్బంది ' ఇటీవల కాలంలో మీరు ఇతర దేశాలకు గానీ రాష్ట్రాలు గానీ ప్రయాణాలు చేశారా?' అని ప్రశ్నించగా... ఆమె లేదు అని సమాధానమిచ్చింది. అది విన్న అక్కడి వైద్య సిబ్బంది... మీకు ట్రావెల్ హిస్టరీ లేదు కాబట్టి కరోనా వైరస్ సోకి ఉండదు. మీరు వెళ్లిపోవచ్చు. అయినా మీరు యుక్త వయసు లోనే ఉన్నారు. మీ శరీరం ఏ వైరస్ పైనైనా పోరాడుతుంది', అని చెబుతూ పంపించేశారు.


ఈ విషయాలన్నీ పద్మ ప్రియ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది. తనకి నాలుగేళ్ల పాప ఉందని కానీ తనకున్న లక్షణాల కారణంగా బిడ్డకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని... అది తన పాప అస్సలే తట్టుకోలేకపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తననొక్కదానినే కాదని దగ్గు, జ్వరం ఆంటీ అనారోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయకుండా ఆస్పత్రి యాజమాన్యం తిరిగి పంపించేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఊపిరి తీసుకోవడానికి కష్టమైనప్పుడు మాత్రమే తనని తిరిగి ఆసుపత్రికి రమ్మన్నారని... అంతవరకు టెస్టులు చేసే పరిస్థితి లేదని చెప్పారని ఆమె తెలిపింది. ఐతే సోషల్ మీడియాలో ఆమె పోస్టు వైరల్ కావడంతో... వైద్యులు వెంటనే ఆమెను పిలిచి కరోనా టెస్ట్ చేశారు. ఆమె నమూనాలకు ప్రస్తుతం డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఇకపోతే ఇలాంటి సంఘటనే తనకు కూడా ఎదురయిందని మరొక సోషల్ మీడియా వినియోగదారుడు చెప్పుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కోవిడ్ 19 హాట్ స్పాట్ గా గుర్తించబడింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం హైదరాబాద్ సిటీ లోనే నమోదవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం... కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు జ్వరం జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉంటే... ఖచ్చితంగా కరోనా వైరస్ టెస్ట్ చేయాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కరోనా టెస్టులు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: