ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ ఎంత హాట్ టాపిక్ గా నడుస్తుందో అదే రీతిలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వార్త కూడా వైరల్ అవుతుంది. గుండె జబ్బు వల్ల సర్జరీ జరుగుతున్న టైములో కిమ్ జాంగ్ చనిపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ప్రపంచ దేశ నాయకుల లో కిమ్ జాంగ్ చాలా విలక్షణమైన వ్యక్తి. విలక్షణమైన పనులు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తన దేశానికి సంబంధించి ఎలాంటి పనులు అయినా చాలా సీక్రెట్ గా చేస్తుంటాడు కిమ్. అణు పరీక్షలు నిర్వహించడంలో శత్రు దేశాలకు వార్నింగ్ ఇవ్వటం లో చాలా వినూత్నంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి విలక్షణమైన కిమ్ జాంగ్ ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో చికిత్స చేయించుకునే క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇలాంటి సమయంలో కిమ్ జాంగ్ స్థానంలో ఉత్తరకొరియా అధ్యక్ష బాధ్యతలను చెల్లెలు కిమ్ యో జోంగ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని తేలింది. ఈమెకు ప్రస్తుతం 31 సంవత్సరాలు. అధ్యక్ష పదవిలో అన్నయ్య కిమ్ జాంగ్ ఉన్న సమయంలో వెనక ఉండి మొత్తం సలహాలు ఇచ్చేది. ఇదే టైమ్ లో కిమ్ జాంగ్ కూడా ఎవరిని నమ్మకుండా తన చెల్లెలు ఇచ్చే సలహాలను మాత్రమే నమ్మే వారంట. చాలా కీలకమైన మీటింగ్ లలో ఎవరిని వెంటబెట్టుకుని వెళ్లకుండా కేవలం తన చెల్లెలిని వెంటబెట్టుకుని వెళ్లి కిమ్ జాంగ్ ఈ సమావేశాల్లో పాల్గొనే వారని ఉత్తర కొరియా దేశంలో రాజకీయ నాయకులు అంటున్నారు.

 

అయితే ప్రస్తుతం కిమ్ జాంగ్ చనిపోవడంతో ఆయన స్థానంలో కి చెల్లెలు రావటం అంటూ వస్తున్న వార్తలపై నార్త్ కొరియా జనాలు భయపడిపోతున్నారు. అన్నయ్య కంటే చెల్లెల్లు చాలా డేంజర్ అని అంటున్నారు. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అన్న ఉన్న టైమ్ లోనే దక్షిణ కొరియాకి అదేవిధంగా అమెరికాకి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ దేశంలో నాయకులు అంటున్నారు. దీంతో ఈమె పగ్గాలు చేపడుతున్నట్లు వచ్చిన వార్తలు విని ఉత్తరకొరియా శత్రు దేశాలు కూడా భయపడిపోతున్నాయి. కాగా ఇప్పటికే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాలో పరిస్థితి మొత్తం అదుపులోకి తీసుకున్నట్లు… త్వరలోనే అధ్యక్ష పదవి చేపట బోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: