వీరు నివసించేది కర్నాటకలోని బెంగళూరులో సిటీలో... కానీ ఆంధ్రప్రదేశ్ లో వీరి ఉద్యోగం ఎమ్మెల్యే.. వ్యాపార రంగాలలో ఆరి తేరిన వ్యాపారవేత్తలుగా ఎలా నెగ్గుతారు...? అని ప్రశ్నలు వెల్లడవుతాయి. బెంగళూరులో వ్యాపారం చేసేవారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఎలా గెలిచారు. అంతేకాకుండా ప్రజా సేవ చేయకుండా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తూ... నియోజకవర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నా తీరు అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 


ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్.. విరు అందరూ కూడా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అంతే కాకుండా ఈ ముగ్గురు కూడా భవన నిర్మాణ రంగంలో వ్యాపారాలు కూడా చేస్తున్నారని చెప్పాలి. మీరు ముగ్గురు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన వారే. ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసే పనులు వైస్సార్సీపీ పార్టీని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా అని వైసీపీ వర్గాలు వాళ్ల భావనని వెల్లడిస్తున్నాయి.

 


అంతే కాకుండా ఇటీవల ఎమ్మెల్యేతో ప్రారంభం జరగాల్సిన ఒక బ్రిడ్జి ఒక సాధారణ వ్యక్తితో ప్రారంభించడం చాలా సంచలనమైన విషయం అయ్యింది. అంతేకాకుండా  ఆ ప్రైవేటు వ్యక్తి బ్రిడ్జిని ప్రారంభిస్తే నవ్వుల పాలయ్యాడు పలమనేరు ఎమ్మెల్యే. ఈ విషయంలో చాలా హాట్ టాపిక్ అయింది అనే చెప్పాలి. ఇక తాజాగా కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ ర్యాలీ పెట్టడంతో కొంత మంది అధికారులకు కరోన పాజిటివ్ రావడం జరిగింది. ఇక దీనితో ఆ ఏరియా మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. 

 


ఇక మరోవైపు కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కూడా బెంగళూరు నుంచి ఆరు వాహనాల్లో మంది వస్తే వాళ్లను దగ్గర చేసుకున్నారట, ఇది కూడా ఒక పెద్ద స్థాయిలోనే చర్చ జరిగిందని చెప్పాలి. అంతేకాకుండా బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంకా కలకలం రేపింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: