కరోనా వైరస్ వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్న ఈ విషయం అందరికీ తెలిసినదే. మందులేని ఈ వైరస్ కి ప్రస్తుత విరుగుడు నియంత్రించడమే కావటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం తో పాటు అనేక దేశాలలో ఆకలి కేకలు వినబడుతున్నాయి. మన దేశంలో కూడా దాదాపు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా  లాక్ డౌన్ అమలులో ఉండటంతో మధ్యతరగతి మరియు పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితి తరుణంలో ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా కుటుంబాలలో ఆహారం కోసం చేయిచాచే పరిస్థితి ఏర్పడింది.

 

కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేంద్రం విఫలమయిందని ప్రజలంతా అంటున్నారు. ప్రభుత్వం తప్పు చేసి ప్రజలను ఈ విధంగా పిల్లల్లో కూర్చోబెట్టి పస్తులు పెట్టడం సమంజసం కాదని అంటున్నారు. కరోనా వైరస్ పక్కనే చైనాలో ఉధృతంగా ఉన్న టైంలో  దేశ సరిహద్దులు విమానాశ్రయాలు అంత క్లోజ్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రజలకు కనీసం నిత్య అవసరాల వస్తువులు ఇవ్వటానికి కూడా కేంద్రం సరైన విధంగా స్పందించకపోవటం పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

 

ఇటువంటి టైములో కేంద్ర ప్రభుత్వం బయో ఇంధనం ద్వారా బియ్యం నుండి శాని టైజర్లు తయారు చేయడానికి అనుమతి ఇవ్వడాన్ని దేశంలో ఉన్న పలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యాన్ని వేస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఆహార ధాన్యాలు అంత ఎక్కువగా ఉంటే దేశంలో ఉన్న మధ్యతరగతి మరియు పేద ప్రజలకు పంచాలి కాని, ఇలాంటి ప్రయోగాలు ఈ సమయంలో చేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: