దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 29,246 పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 21,201 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. అయితే ఈ కరోనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల కరోనా కేసులు 1000 దాటేశాయి. ఏపీలో 1177 కేసులు నమోదు కాగా, 911 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.  అటు తెలంగాణలో 1003 కేసులు నమోదైతే 646 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.

 

అయితే మొన్నటివరకు తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసులు తక్కువగా ఉండేవి. కానీ గత నాలుగు రోజుల నుంచి ఏపీలో కేసులు బాగా పెరిగాయి. రోజుకూ ఎక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతూ  వచ్చాయి. అదే సమయంలో తెలంగాణలో తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్యలో ఏపీ, తెలంగాణని దాటేసింది.

 

ఇక ఇలా కేసులు పెరిగిపోవడంతో ఏపీలో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. జగన్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయని అంటున్నారు. అసలు కరోనాని అరికట్టడంలో జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. దీంతో వారి విమర్శలకు చెక్ పెట్టేందుకు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, లెక్కలతో సహా ఓ లాజిక్ చెప్పారు.దేశంలో  సగటున 10 లక్షల మందికి పరీక్షలు చేస్తే అందులో 1396 పరీక్షలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉందని చెప్పారు.  సుమారుగా ఇప్పటి వరకు 74,551 టెస్టులు చేస్తే, 1177  పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

 

ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 18,756 పరీక్షలు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయని, దాంట్లో 1001 మందికి పాజిటీవ్ వచ్చిందన్నారు. కాబట్టి ఏపీలో కరోనాను అరికట్టలేకపోతున్నారని చేస్తున్న విమర్శలు మాని.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అయితే వెల్లంపల్లి చెప్పిన లెక్కలు బట్టి చూస్తే, కరోనాని అరికట్టడంలో ఏపీనే ముందుందని తెలుస్తోంది. మరి ఈ విషయం ప్రతిపక్షాలు అర్ధం చేసుకుని విమర్సలు మానేస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: