భారత దేశంలో ప్రస్తుతం రెండవ దశలో లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్  మే 3 తో ముగిసిపోతుంది.. ఇక ఆ తర్వాత లాక్ డౌన్  పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లాక్ డౌన్  జూన్ వరకు కొనసాగుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కూడా బలంగా నడుస్తోన్నాయి . అయితే ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడిన సమయంలో గాని లేదా అధికారులతో మాట్లాడినప్పుడు కానీ.. మే చివరి తేదీ వరకు కూడా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. మే 19 తర్వాత కరోనా  వైరస్ కేసులు తగ్గడం మొదలవుతాయని అంటున్నారు. 

 

అయితే ఈ లోపు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కరోనా  వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయే  అవకాశాలున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే జూన్ తర్వాత ఎలాంటి కొత్త కేసులు భారత్లో నమోదవ్వవు  అంటూ  బలంగా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన కూరగాయల దుకాణాలు సహా నిత్యవసర సంబంధించిన వస్తువుల విషయంలో ఎలాంటి సమస్య రాకపోతే  జూన్ తర్వాత పూర్తిగా లాక్ డౌన్  ఎత్తి వేయడానికి వీలు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 


 అయితే ప్రస్తుతం అత్యవసర సేవలు సహా మరికొన్ని సేవలు అందుబాటులో ఉన్నట్టుగానే జూన్ వరకు కూడా ఇలా కొన్ని సేవలు అందుబాటులో ఉంచి లాక్ డౌన్  కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నారు  విశ్లేషకులు. అయితే ఈ లాక్ డౌన్  తో జూన్ మొదటి వారం వరకు కొనసాగిస్తారా  లేదా చివరి వారం వరకు కొనసాగిస్తారా అన్నది మాత్రం అప్పుడు వైరస్ ప్రభావాన్ని బట్టి ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నిపుణుల తో  జరుగుతున్న చర్చలు ఫలిస్తే  జూన్ తర్వాత పూర్తి స్థాయిలో కాకపోయినా 85 శాతం అయినా లాక్ డౌన్ ఎత్తేసే   అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: