ప్రస్తుతం బెట్టింగ్ హవా బాగా నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. మేటర్ ఎలాంటిదైనా సంఘటన ఎలాంటిదైనా బెట్టింగ్ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మొదట క్రికెట్ బెట్టింగ్ పెట్టేవాళ్ళు... ఆ జట్టు  గెలుస్తుంది ఈ జట్టు  గెలుస్తుంది అంటూ బెట్టింగ్ పెట్టేవారు. ఆ తర్వాత ఈ బాల్ కి సిక్స్ కొడతారు ఆ బాల్ సిక్స్ కొడతారు  అంటూ బెట్టింగ్ పెట్టేవారు. ఆ తర్వాత  సినిమాలపై కూడా ఈ సినిమా హిట్ కొడుతుంది లేదా  వసూళ్ళు రాబడుతుంది బెట్టింగ్ పెట్టేవాళ్ళు. ఇలా బెట్టింగ్ పెట్టేవాళ్ళు  చాలా మంది ఉంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. 

 

 అది కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై బెట్టింగ్ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  గుంటూరు దగ్గర్లోనే ఒక క్లబ్ లో మూడు సామాజిక వర్గాలు. ఆ మూడు సామాజిక వర్గాలు కూడా ఆర్థికంగా బాగా సెట్ అయిన వారు చేసుకున్నటువంటి బెట్టింగులు.ఇక్కడ  లక్షలకు లక్షలు చేతులు మారుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం గుంటూరులోని ఆక్లబ్ లో  జరుగుతున్న బెట్టింగ్ లలో రెండు రకాల బెట్టింగ్ లు ఉన్నాయి. మొదటిది నిమ్మగడ్డ కేసులో గెలుస్తారు అన్నదానిపై 100 కి 300 రూపాయల బెట్టింగ్లు ఇస్తున్నారు. 

 


 అయితే మరో వైపు నుంచి బెట్టింగ్ చేసే వాళ్ళ సంఖ్య భారీగా తక్కువగా ఉంది. మరో విషయం ఏంటంటే....  నిమ్మగడ్డ కేసుకు సంబంధించి ఆయన దగ్గర లాప్టాప్ పెన్ డ్రైవ్ తీసుకుని వాంగ్ములం  తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు కంటే ముందే ఇదే ఎఫ్ఐఆర్ చేస్తారు అని మరో బెట్టింగ్ కడుతున్నారు. ఆ కేసు జడ్జిమెంట్ వచ్చేలోపే.... తిరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో  తొందరగా ప్రొడ్యూస్ చేస్తారు అన్నది ఒక బెట్టింగ్ జరుగుతుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టి హైకోర్టులో దీన్ని చూపించి ఇలా జరిగింది కాబట్టి ఆ కేసు మీద జడ్జ్మెంట్ ఇవ్వవద్దు  అని అని చెబుతారు అంటూ మరోటి . ఇలా కొత్త తరహా బెట్టింగ్లు చర్చనీయాంశంగా మారాయి అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: