కరోనా వైరస్ దెబ్బకి ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ వణికిపోతోంది. దేశంలో ఇప్పటివరకు మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా త్వరలో గుజరాత్ లో పరిస్థితి చూస్తే మహారాష్ట్రలో కేసులు మించిపోయేలా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రం ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నా రాష్ట్రంగా రెండో స్థానంలో ఉంది. మూడు వేలకు చేరువలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఆందోళనలో నెలకొంటున్నాయి. దీంతో గుజరాత్ లో తాజా పరిస్థితి తెలుసుకుని ప్రధాని మోడీ కూడా ఆందోళన చెందటం జరిగిందట. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి తో ఫోన్ లో రాష్ట్రంలో అంతగా వైరస్ వ్యాప్తి చెందటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారట.

 

ఎక్కువగా అహ్మదాబాద్, సూరత్ వంటి పట్టణాల్లోనే కరోనా పాజిటివ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దాదాపు వందకు చేరువలో కరోనా కారణంగా మరణించిన వారు ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నయి. ఒకానొక సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి.

 

మరొకపక్క గుజరాత్ లో ఈ వైరస్ ఈ విధంగా వ్యాప్తి చెందటానికి అన్ని కారణాలు బట్టి చూస్తుంటే కొంత మంది కుర్రకారు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారని వాళ్లని ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడంలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: