కరోనా దెబ్బకు నెలక్రితం ప్రపంచం వణుకుతున్నప్పుడు రష్యా దేశం చాలా దీమాగా ఉంది. చైనాతో సరిహద్దు ఉన్నా సరే కరోనాను బాగా కట్టడి చేసిన దేశంగా రష్యా నిలిచింది. కానీ కొన్ని రోజులుగా రష్యాలో సీన్ మారిపోతోంది. ఇప్పుడు రష్యాలోనూ కరోనా విజృంబిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు అక్కడ కూడా నమోదవుతున్నాయి.

 

 

షాకింగ్ న్యూస్ ఏంటంటే.. రష్యా సైన్యంలోనూ కరోనా అలజడి సృష్టిస్తోంది. ఆ దేశ సైన్యంలో చాలా మందికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 900 మంది మంది సైనికులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆ దేశ రక్షణ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 400 మందిని ఇంటి వద్దనే క్వారంటైన్ చేసినట్లు రష్యా చెబుతోంది.

 

 

ఇక మిగతా వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందట కూడా. ఒకరు వెంటిలెటర్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు రష్యా అధికారులు వివరించారు. రష్యాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.

 

రష్యాలో ప్రస్తుతం 90 వేల వరకూ కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో నిన్న ఒక్కరోజే ఆరు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 50మంది వరకూ చనిపోయారు. ఇప్పటి వరకూ రష్యాలో కరోనాతో 800 మంది వరకూ చనిపోయినట్టు రష్యా చెబుతోంది. అందుకే ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా మే 9న జరగాల్సిన మిలిటరీ పేరేడ్ ను కూడా క్యాన్సిల్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: