ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి కరోనా పరీక్షలు జరపాలని నిర్ణయించారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ సూచనల మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సేవల ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 
 
రెడ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు మే 3వ తేదీ వరకు కఠినంగా అమలవుతాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో స్విగ్గీ హోం డెలివరీ సదుపాయం ద్వారా కూరగాయలు అందజేస్తున్నామని ప్రకటన చేశారు. విశాఖలో ఇప్పటివరకు 11,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని.... జిల్లాకు 11,265 మెడికల్ టెస్ట్ కిట్లు వచ్చాయని తెలిపారు. ఈ కిట్లకు అదనంగా మరో 16 వేల కిట్లను తెప్పిస్తున్నామని అన్నారు. 
 
సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో నెలరోజుల్లో టెస్టుల సమార్థ్యాన్ని భారీగా పెంచామని అన్నారు. గతంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసే ఒక్క ల్యాబ్ కూడా లేదని ఆ ల్యాబ్ ల సంఖ్య 9కు పెంచామని తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించారు. 
 
ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో పీపీఈ, ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్రిటికల్ కేర్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెద్దలకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. రాష్ట్రంలోని 637 మండలాల్లో 63 రెడ్ జోన్లు, 53 ఆరెంజ్ జోన్లు, మిగిలిన మండలాలన్నీ గ్రీన్ జోన్లలో ఉన్నాయని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: