ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు చేస్తోంది. కావాలంటే అత్యవసర సరుకులు కూడా ఇంటికి తెచ్చిస్తాము  దయచేసి ఇంటి నుంచి బయటకు రాకండి అంటూ  ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ ను జయించగలమని   స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వం. కానీ చాలా మంది ప్రభుత్వ నిబంధనలను మాత్రం భేకాతరు  చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వాటన్నింటిని లెక్క చేయకుండా  రోడ్లమీదకు చేరుకుంటున్నారు చాలా మంది జనాలు . ఇక రోడ్ల మీదకు చేరుకున్న జనాలను ఇంటికి పంపించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు, 

 

 

ఈ క్రమంలోనే పోలీసులకు రోడ్ల మీదికి వచ్చిన వారిని ఇంటికి పంపించడం పెద్ద సవాలుగా మారింది అని చెప్పాలి. ఇక పోలీసులు ఇంటికి పంపాలని ప్రయత్నిస్తే కొంతమంది వ్యక్తులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి లాల్ డౌన్  నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీదికి వచ్చినప్పుడు పోలీసులు తనను అడ్డుకున్నారు అంటూ ఏకంగా గొంతు కోసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగింది ఈ విచిత్ర ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సామర్లకోట మండలం మేడ పాడుకు  చెందిన లోవరాజు బైక్పై వెళ్తున్నాడు ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న పోలీసులతో నిబంధనలను అతిక్రమించడంతో  అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లోవరాజు వెంటనే బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. 

 

 

 లోవరాజు ప్రవర్తించిన తీరుకు అటు పోలీసులు కూడా షాక్  ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బ్లేడ్ తో  పీక కోసుకోవడంతో  తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు లోవరాజు పీక కోసుకోవటం  వెనుక వేరే కారణం ఉంది అని చెబుతున్నారు. మద్యం మత్తు,  కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: