కర్నూలు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో గత 31 రోజుల్లో 292 కరోనా కేసులు నమోదు కాగా ఈరోజు 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 332కు చేరింది. ఒక్కరోజే 40 కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో ప్రజలు కరోనా పేరు వింటే గజగజా వణుకుతున్నారు. 
 
 
జిల్లాలో వైరస్ కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. జిల్లాలో కర్నూలు, నంద్యాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ప్రాంతాల ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. అధికారులు జిల్లాలోని 35 ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర వైద్య బృందాలు జిల్లాలో ఇప్పటివరకు పర్యటించలేదు. జిల్లాలో ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. 
 
 
జిల్లాలో ఆరుగురు వైద్యులు కరోనా భారీన పడ్డారు. అధికారులు జిల్లాలో ఇప్పటివరకు 24 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1755 మంది చేరగా 14 రోజుల వ్యవధి పూర్తి చేసుకున్న 703 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 1052 మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే జిల్లా నుంచి 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇప్పటివరకు జిల్లాలో 9 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1259కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 970 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టగా ఏపీలో కరోనా విజృంభణ తగ్గకపోవదంపై ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: