శ్రీకాకుళం.. విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో,  విజయనగరం జిల్లాలో టెన్షన్ మొదలైంది. నిన్నటి వరకు సేఫ్ గా ఉన్న సిక్కోలు, కరోనా ఖాతాలోకి వెళ్లిపోవడంతో జిల్లాలో అలజడి మొదలైంది. జిల్లా అంతటా భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.... వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తుంది.రాష్ట్రంలో 12 జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు  గ్రీన్ జోన్ లో ఉన్న  శ్రీకాకుళంలో కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో,  విజయనగరం జిల్లాలో టెన్షన్ మొదలైంది. జిల్లాకు సరిహద్దుగా ఉన్న విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒడిషాలో కేసులు పెరుగుతుండటంతో, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 

 

శ్రీకాకుళం జిల్లాలో పాజిటివ్ కేసులకు కారణమైన వ్యక్తికి అనేక ప్రాంతాల్లో ట్రావెల్ హిస్టరీ ఉండటంతో.. విజయనగరం జిల్లా అధికారుల్లో  గుబులు రేపుతోంది. సిక్కోలు వ్యక్తి విజయనగరం ఏమైనా వచ్చాడా,  జిల్లా వాసులు ఎవరైనా ఆతనితో కలిసారా అన్నకోణంలో ఇంటెలిజెన్స్ , స్పెషల్ బ్రాంచ్ బృందాలు కూపీలాగే పనిలో ఉన్నాయి. సిక్కోలు వ్యక్తి పాల్గొన్న వివాహ వేడుకలో,  జిల్లావాసులెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

 

పొరుగు జిల్లా సిక్కోలులో పాజిటివ్ కేసులు రావడంతో సరిహద్దులన్నీ పూర్తిగా మూసివేశారు. జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు విజయనగరం ఏజెన్సీ గ్రామాల నుండి శ్రీకాకుళం జిల్లాకు ఉన్న దారులన్నీ మూసివేశారు అధికారులు.

 

మరో వైపు మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగి జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా,  ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలంటూ అధికారులకు దిశా నిర్దేశం చేసారు. జిల్లాలో ఇప్పటి వరకు 3వేల500 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  అన్నీ నెగటివ్ గా వచ్చాయన్నారు మంత్రి బొత్స.  విదేశాలు, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించామని.. వలస~కూలీలను సైతం వాలంటీర్లు ద్వారా గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.  ఇంతకాలం గ్రీన్ జోన్ లో ఉన్నామని సంబరపడిన జిల్లా వాసులు, సరిహద్దు జిల్లాల్లో  పాజిటివ్ కేసులతో టెన్షన్ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: