దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకాలు... పేద విద్యార్థుల అభ్యున్నతికి ఆయన లక్ష్యం... ప్రతి ఒకరు చదువుకోవాలి.. పేద విద్యార్థులందరి తలరాతలు మారాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీవినీ ఎరుగని పథకాలను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతూ పేద విద్యార్థుల పాలిట వరాలను కురిపించే దేవుడి గా మారిపోయాడు. 

 

 

 మా తలరాతలు ఇంతే పెద్ద చదువులు మాకు రాసిపెట్టి లేవు  అని నిరాశతో ఉన్న పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా జగనన్న విద్య వసతి దీవెన అనే సరికొత్త పథకానికి ఊపిరి పోశారు. బోర్డింగ్,  లాడ్జింగ్ కు జగన్ అన్న వసతి దీవెన పథకం కింద ఏకంగా విద్యార్థులకు 20 వేల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది.త్రైమాసికం  పూర్తవగానే ఫీజుల నగదు తల్లి ఖాతాలో జమ అవుతుంది. 

 

 

 ఈ సందర్భంగా ఈ పథకం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య కొరకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు ఆయన ఆశీర్వాదం తోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆనాడు పేదోడి కూడా మెరుగైన విద్య పొందే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి... ఇక ఈనాడు  పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకానికి ఊపిరి పోశారు తనయుడు జగన్మోహన్ రెడ్డి. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు హయాంలో పేదలు తలరాతలు మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: