దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 6869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 934 మంది మృతి చెందారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఐవర్ మెక్టిన్ అనే ఔషధం కేవలం 48 గంటల్లో వైరస్ ను చంపగలదని చెబుతున్నారు. 
 
 
నార్త్‌షోర్ యూనివర్శిటీ హెల్త్ సిస్టమ్ ఆఫ్ అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ నీరవ్ షా మీడియాతో మాట్లాడుతూ ఐవర్ మెక్టిన్ పూర్తిగా సురక్షితమైన ఔషధం అని చెప్పారు. మోనాష్ బయోమెడిసిన్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కైలీ వోగ్‌స్టాఫ్ కూడా ఐవర్ మెక్టిన్ 48 గంటల్లో కరోనా వైరస్ ను అంతం చేయగలదని అన్నారు. ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ మెడికల్ సెంటర్ డాక్టర్ జాక్వెస్ రెజ్టర్ ఇప్పటికే ఈ మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. 
 
ఇతర శాస్త్రవేత్తలు కూడా వెంటిలేటర్ పై ఉన్నవారిపై ఈ మందును ప్రయోగించగా మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. వైద్యులు కరోనా భారీన పడిన రోగులు ఎంత త్వరగా చికిత్సకు వస్తే అంత మంచి ఫలితం ఉంటుందని అన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం జంతువులలోని కీటకాలను చంపేందుకు ఈ మందును తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మరోవైపు ప్రపంచ దేశాలు కరోనాకు మందు కనిపెట్టడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ ప్రయోగాల్లో ఏ ఒక్క ప్రయోగం సక్సెస్ అయినా కరోనాకు మందు అందుబాటులోకి వచ్చినట్టే అని చెప్పవచ్చు. అమెరికా, చైనా, భారత్, ఇతర దేశాల్లో కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్ ను కనిపెట్టి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: