ఔను. మునుపటిలా ప‌రిస్థితులు ఏవీ ఉండ‌వు. అంతా క‌రోనా మ‌హిమా. ప్రతీది క‌రోనాతో ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఉంటుంది అని అనుకోవాల్సిసి ఉంటుంది. అలా త‌గిన మార్పులు చేసుకోవాలి. ఇంత‌కీ తాజా విష‌యం ఏంటంటే... మీరు మునుప‌టి వ‌లే ప్ర‌యాణం చేయ‌లేరు. ప్ర‌జా ర‌వాణాలో బీ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే.

 


బ‌స్సుల్లో మునుప‌టి వ‌లే కూర్చునేందుకు ప్ర‌జ‌లు సంశయించాల్సిందే. సామాజిక దూరం పేరుతో సీట్లలో ఇద్ద‌రు కాకుండా ఒక‌రు కూర్చుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌జ‌లు ఈ వైర‌స్ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హిస్తూ ముందుకు సాగే ప‌రిస్థితి ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో మ‌రో స‌మ‌స్య ఎదురు కావ‌చ్చున‌ని తెలుస్తోంది. తాజాగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సుల్లో సీటుకు ఒక్కరినే కూర్చునేలా ఆదేశాలు జారీ చేశారు.

 


తెలంగాణ విష‌యానికి వ‌స్తే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాక్‌డౌన్‌ తీవ్రంగా దెబ్బతీస్తోంది. టిక్కెట్ల ద్వారా వచ్చే మెజార్టీ రాబడికి గడచిన 30 రోజులకుపైగా గండి పడుతూ వస్తోంది. ఈ ప్రభావం సంస్థలో అనేక ఇబ్బందులు సృష్టించనుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ‌కు ఈ నెలలో దాదాపు రూ. 7వేల కోట్లకు గానూ ఇప్పటివరకు రూ. 500కోట్లకు మించి రాబడి రాలేదని ఆర్ధిక శాఖ ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల వేతనాలపై ముందస్తు చర్యలు ఆరంభించింది. కార్పొరేషన్లనుంచి రాబడి పూర్తిగా ఆగిపోవడంతో ఆయా సంస్థల వేతనాలపై ఏప్రిల్‌ మాసం పెను ప్రభావం చూపనుంది. బస్సులను రాష్ట్రవ్యాప్తంగా తిప్పడమే ఆర్టీసికి ఉన్న ప్రధాన ఆదాయ వనరు. ప్రయాణీకుల టిక్కెట్ల ఆదాయమే నెలకు రూ. 400కోట్లకుపైగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో 7300 బస్సులు, 2800 అద్దె బస్సులు ఉన్నాయి. ఇందుకు 49 వేల మంది సిబ్బందిని వినియోగించి రోజుకు కోటి మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసి రికార్డులు సృష్టిం చింది. అయితే గతంలో జరిగిన సమ్మె నష్టాలనుంచే ఇంకా ఆర్టీసి తేరుకోలేదు. దీని ప్రభావం ఇంకా కొన సాగుతూ వస్తోంది. అప్పటి వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ప్రకారం ఇంకా 12 రోజుల వేతనాలు పెండిం గ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా అదుపులోకి రాకముందే కరోనా ప్రభావం సంస్థపై పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: