జగన్ విపక్షంలో ఉన్నపుడు కూడా మోడీని పల్లెత్తు మాట అనలేదు, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన చంద్రబాబునే టార్గెట్ చేసేవారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ప్రధానితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటువంటిది జగన్ మోడీకి యాంటీగా ఉంటారా అన్నదే ఒక షాక్ లాంటి న్యూస్.

 

 ఇక లాక్ డౌన్ జగన్ కి మోడీకి పేచీపెట్టేలా ఉందని అంటున్నారు. నిజానికి లాక్ డౌన్ ఈ పదం కూడా కరోనాతో పాటు జనాలకు తెలిసిపోయింది. ఎపుడో వందేళ్ళ క్రితం స్పానిష్  ఫ్లూ వచ్చిన తరువాత అప్పట్లోనే హైదరాబద్ లో నిజాం పాలనలో లాక్ డౌన్ విధించారుట. ఓ వైపు దేశంలో బ్రిటిష్ వారు లాక్ డౌన్ ప్రకటించారు. ఆ ఫ్లూని తట్టుకోవడానికి జనాలను ఇంటిపట్టున ఉంచడానికి లాక్ డౌన్ విధించారని చరిత్ర చెబుతోంది.

 

ఇక ఏపీలో చూసుకుంటే లాక్ డౌన్ తరువాత ఆర్ధిక పరిస్థితి బాగా దిగజారింది. దాంతో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ఎన్నాళ్ళు విధిస్తే అన్నాళ్ళూ రాష్ట్రానికి ఇబ్బంది అని అంటున్నారు. ఏప్రిల్ నెల మొత్తానికి 76 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాకు చేరిందంటే దారుణమైన పరిస్థితి ఏపీలో ఉందని చెప్పాలి.


 
ఈ క్రమంలో  లాక్ డౌన్ ఎత్తివేయాలని జగన్ భావిస్తున్నాడని అంటున్నారు. లాక్ డౌన్ వల్ల అన్ని రకాలుగా బతుకు బండి నడవడం కష్టమైపోతోందని అంటున్నారు. దీంతో జగన్ లాక్ డౌన్ ఎత్తివేయడానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఎత్తివేసిన తరువాత సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆదాయానికి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.

 

మరి దేశమంతటా లాక్ డౌన్ని కొనసాగించలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారని తెలుస్తోంది. కానీ ఏపీలో మాత్రం జగన్ లాక్ డౌన్ విధిస్తే ఇక ఆదాయ మార్గాలు మొత్తం మూసుకుపోయి రాష్ట్రం ఇబ్బందులో పడుతుందని ఆలోచిస్తున్నారు. మరి అదే కనుక జరిగితే దేశమంతా ఒక ఎత్తు, ఏపీలో మరోలా కధ ఉంటుందేమో, దీని మీద మోడీ ఏమంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: