కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. దీని దెబ్బతో ప్రపంచమే ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకుంది. రోడ్డు మీదకు రావాలంటే భయపడుతోంది. ఈ కరోనా కారణంగా లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల, కోట్ల డాలర్ల ఆదాయం ప్రపంచం నష్టపోయింది. అయితే ఈ కరోనాతో అంతా నష్టమేనా.. ఏ మాత్రం లాభం లేదా అంటే చాలా లాభాలు కూడా ఉన్నాయి.

 

 

వాటిలో అన్నింటి కంటే పెద్ద లాభం ఏంటో తెలుసా.. మానవాళిని అర్థ శతాబ్దం నుంచి ఆందోళన పెడుతున్న ఓ పెద్ద సమస్య ఇప్పుడు పరిష్కారమైపోయింది. అదే.. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం. అవును. దాదాపు 1970ల్లో ఓజన్ పొరకు ఓ రంధ్రం ఏర్పడింది. పారిశ్రామిక విప్లవం తర్వాత ఏర్పడిన జోరు కాలుష్యం కారణంగా భూమికి కవచంగా ఉన్న ఈ ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడింది.

 

 

సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను ఫిల్టర్ చేసే అద్భుతమైన ప్రకృతి సహజమైన ఈ ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటం పర్యావరణ వేత్తలను ఎప్పటి నుంచో ఆందోళన పరుస్తోంది. కాలుష్యం తగ్గించండ్రా నాయానా అంటే ఏ దేశం మాత్రం వింటుంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభాకు ఎలాంటి లోటూ లేకుండా అన్నీ సమకూరాలంటే పరిశ్రమలు ఉండాల్సిందే. అలా ఇది ఓ జఠిల సమస్యగా మారింది.

 

 

ఈ సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాల మధ్య ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు .. ఇన్నాళ్లకు ఈ లాక్ డౌన్ కారణంగా స్తంభించిన ప్రపంచంతో ఓజోన్ పొర కూడా తనకు తానే రంధ్రాన్ని పూడ్చుకుంది. ఇది నిజంగా ప్రపంచానికి పెద్ద శుభవార్తే. కానీ.. ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తేశాక.. కరోనాను జయించాక మళ్లీ మామూలే కదా అన్న ఆందోళన మాత్రం ఉండనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: