కరోనా కి బ్రేక్ పడటం లేదు, మరోపక్క కేసుల గ్రాఫ్ పెరిగిపోతూనే ఉంది. మరణాలు కూడా ఆగడం లేదు. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి నెలరోజులు పైగానే గడుస్తుంది. అయినా కానీ దేశంలో ఎక్కడా కూడా పరిస్థితి అదుపులోకి కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరింత పొడిగించే పరిస్థితి ఉందని చాలామంది అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించడానికి ఆల్రెడీ రెడీ అయిపోయారు. కేంద్రం ఇచ్చిన సడలింపు లను సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మల్లి పొడిగిస్తారా ? పొడిగిస్తే మళ్లీ ఎన్ని రోజులు పొడిగిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఇటీవల 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చాలా మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదని మోడీకి సూచించినట్లు సమాచారం. దీంతో ముఖ్య మంత్రులతో భేటీ అయిన తర్వాత ఇప్పటివరకు మోడీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ప్రజలను ఒక పక్కా ప్రణాళికతో మెంటల్ గా లాక్ డౌన్ పొడిగించడానికి సిద్ధం చేస్తున్నారని మేధావులు అంటున్నారు. 

 

ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా పరిస్థితిని బట్టి చూస్తే వాటిని కూడా వెనక్కి తీసుకుని పూర్తిగా జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించేందుకే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రణాళికలను సిద్ధం చేయాలని మోడీ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: