పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ,తమిళనాడు తరహాలో తెలంగాణ లో కరోనా టెస్టులు జరగడం లేదని వచ్చిన విమర్శలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రోజు వారి కరోనా కేసులను ప్రకటించేందుకు మీడియా సమావేశంఏర్పాటు చేసిన ఈటల.. టెస్టులు ఎక్కువ చేయడం గొప్ప కాదని..లక్షణాలు వున్న వారికే టెస్టులు చేస్తున్నాం తప్ప ఎవరికి పడితే వారికి చేయం అని తేల్చిచెప్పారు. టెస్టుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఐసీఎమ్మార్ సూచనల ప్రకారం టెస్టులు జరిపిస్తున్నాం అలాగే హెల్త్ బులిటెన్ విషయంలో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్న ఈటల... రాపిడ్ టెస్టులు చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు.  
 
ఇక ఈ రోజు కొత్తగా మరో 6 కేసులు నమోదయ్యాయని అవన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలోనేనని వెల్లడించారు. గత నాలుగు రోజుల నుండి కరోనా కేసులు భారీగా తగ్గాయని మే 8లోగా కరోనా పూర్తిగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులు తెలుసుకోవడానికి రాష్ట్రం లో పర్యటించిన కేంద్ర బృందం కూడా  తెలంగాణ ను ప్రశంసించిందని ప్రస్తుతం రాష్ట్రంలో  22 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని ఈటల పేర్కొన్నారు. 
 
ఈ 6కేసులతో కలిపి తెలంగాణ లో మొత్తం కేసులసంఖ్య 1009 కు చేరింది. ఇందులో ఇప్పటివరకు  374 మంది కోలుకోగా 25 మంది మరణించారు. ప్రస్తుతం 610 కేసులు మాత్రమే యాక్టీవ్ లో వున్నాయి. ఇదిలావుంటే ఆంధ్రాలో మాత్రం కరోనా కేసుల సంఖ్య  భారీగా పెరుగుతుంది. ఈఒక్క రోజే  అక్కడ 82 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూల్ లోనే 40కేసులు నమోదుకాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1259 కు చేరింది.   
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: