దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పట్లో తొలగేలా లేదు. ముప్పు తొలగడానికి  ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.. కరోనా టైమ్‌లో ఎన్నో రాష్ట్రాలకు వారధిగా పని  చేస్తున్నారు. సారధిగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్‌లో ఇరుక్కుపోయిన మత్స్య కార్మికులు.. మరికొన్ని ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు.. బత్తాయి రైతులు  ఇలా అనేక సమస్యలను కరోనా కమాండర్‌గా పరిష్కరిస్తున్నారు. 

 

కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్‌ నడుస్తోంది. ఇండియాలో కూడా అదే సీన్‌.. అయితే.. సడెన్‌గా లాక్‌డౌన్‌ విధించడంతో.. దేశంలో చాలా పనులు ఆగిపోయాయి..  ఎక్కడివాళ్లక్కడే ఆగిపోయారు. సొంతూళ్లకు వెళ్లలేక.. ఉన్నచోట ఉండలేక..ప్రజా రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. మరికొంతమంది వందల కిలోమీటర్లు  నడుస్తూ..సొంతూళ్లకు వెళ్తూనే ఉన్నారు.

 

ఇదే టైమ్‌లో.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అయిన కిషన్‌రెడ్డిని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీంతో.. ఆయన చాలా విషయాల్లో చొరవ  తీసుకున్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నేనున్నానంటూ.. చాలా సహాయ సహకారాలు అందించారు. 

 

కాశీ.. ముంబయ్‌..బీహార్‌..ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాల్లో ఇరుక్కున్న చాలా మంది వలస కార్మికులను వాళ్ల సొంతూళ్లకు పంపించే ప్రయత్నాలు కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌  ఇన్‌ఛార్జ్‌గా కిషన్‌ రెడ్డి చేశారు. ఎంతోమందిని తమ తమ ప్రాంతాలకు పంపించారు. జీవనోపాధి లేని ఎంతోమంది కూలీలకు వాళ్లున్న చోటే ఆకలి దప్పులు తీర్చే ఏర్పాట్లు కూడా  చేశారు. 

 

గుజరాత్‌లో ఇరుక్కున్న ఏపీకి చెందిన 3 వేల మందికి పైగా మత్స్య కార్మికులను కూడా సొంతూళ్లకు పంపేందుకు పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా.. బత్తాయి రైతుల విషయమే.. ఆయనను కదిలించింది.. కరోనా వైరస్ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా ఉంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలను  మూసివేశారు. దీంతో ఆజాద్ పూర్ పండ్ల మార్కెట్ కూడా డిఫాల్ట్‌గా క్లోజ్ చేశారు. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్‌గా ఆజాద్ పూర్ మండీకి పేరు ఉంది. తెలుగురాష్ట్రాల నుంచి  ఇక్కడికి పండ్లు వస్తుంటాయి. అయితే ఈ సారి కరోనా కారణంగా పండ్ల విక్రయం జరగదని తెలిసి రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఇక్కడే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జ్‌గా  కిషన్‌ రెడ్డి చొరవ తీసుకున్నారు. 

 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో నల్గొండ బత్తాయి రైతులకు ఊరట కలిగింది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ఢిల్లీ అజాద్‌పూర్‌ పండ్ల మార్కెట్‌ను అధికారులు తిరిగి  తెరిపించారు. బత్తాయి రైతుల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి.. ఇకపై 24 గంటలు అజాద్‌పూర్‌ మండి తెరచి ఉండేలా చర్యలు చేపట్టారు.  ఆసియాలోనే అతిపెద్ద పండ్ల కూరగాయల మార్కెట్‌గా పేరొందిన అజాద్‌పూర్‌ పండ్ల మార్కెట్‌కు తెలంగాణ నుంచి ప్రతి ఏడాది 30 వేల టన్నుల బత్తాయి పండ్లు తరలిస్తారు.  లాక్‌డౌన్‌ కారణంగా బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మార్కెట్‌ను తెరిపించే విధంగా చొరవ  తీసుకున్నారు. 

 

పండ్ల మార్కెట్‌ తెరిచినా..మిగతా మాల్స్‌.. థియేటర్స్‌..అన్నీ లాక్‌డౌన్‌లోనే ఉంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు. హాట్ స్పాట్స్‌.. రెడ్‌ జోన్లలో చాలా వరకు ఆంక్షలు  కొనసాగుతాయన్నారు. ఎన్ని సమస్యలున్నా కరోనాను ఎదుర్కోవాలని..ఇప్పట్లో కరోనాను నిలువరించడమే మనముందున్న కర్తవ్యమని ఆయన చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు  కాపాడటమే ముఖ్యమన్నారు. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతినివ్వడం కష్టమేనని ఆయన చెబుతున్నారు. విద్యాసంస్థల పరిస్థితి కూడా ఇంతేనని..ఆయన  చెప్పుకొచ్చారు.

 

లాక్‌డౌన్‌ వల్లే కొన్ని వేల ప్రాణాలు కాపాడగలిగామని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జ్‌ కిషన్‌ రెడ్డి చెప్పారు.. ప్రస్తుతం 290 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు లేవని..  రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తూనే.. మిగతా చోట్ల సడలింపు ఉంటుందని ఆయన అన్నారు. అందుకే మే 3 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగించినా..ఎత్తేసినా.. ప్రజలు మాత్రం సోషల్‌ డిస్టన్స్‌ పాటించాలని..చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు..ఇంకా తన అభిప్రాయాలను ఎన్టీవీతో  ఇలా పంచుకున్నారు.

 

సో.. దేశవ్యాప్తంగా కరోనా కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు..వలస కార్మికులకు..రైతులకు.. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జ్‌గా కిషన్‌ రెడ్డి.. ఆపద సమయంలో అండగా  నిలుస్తున్నారు. ధైర్యాన్ని నింపుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: