కరోనా మహమ్మరిపై జగన్ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు చేస్తూ, కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కరోనా టెస్టుల సంఖ్యని పెంచారు. దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీనే టాప్ లో ఉంది. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా జగన్ చర్యలు తీసుకుంటూనే, వాస్తవాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

అందులో భాగంగానే తాజాగా మీడియా సమావేశంలో కరోనా కూడా మనిషి జీవితంలో భాగం అవుతుందని, అది కూడా సాధారణ జ్వరం లాగానే వచ్చి, తగ్గిపోతుందని చెప్పారు. తర్వాత దానికి వ్యాక్సిన్ వస్తుందని అన్నారు. ఇక ఇలా జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్సలు వస్తున్నాయి. కరోనా కట్టడి చేయడంలో జగన్ చేతులెత్తేశారని, కరోనాకు స్థావరంగా ఏపీ ఉందని మాట్లాడుతున్నారు.

 

ఇదే సమయంలో కొందరు టీడీపీ అనుకూలంగా ఉండే రాజకీయ విశ్లేషుకులు పాలనలో జగన్ ఫెయిల్ అయిపోయినట్లేనని, చంద్రబాబుకు పుంజుకోవడానికి ఇదే మంచి అవకాశమని చెబుతున్నారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలకు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. కరోనా గురించి జగన్ రియాలిటీ చెప్పారని, అది ప్రతిపక్షాలకు అర్ధం కావడం లేదని మండిపడుతున్నారు.

 

వాస్తవాలని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలని, కరోనా వ్యాప్తి తెలియకుండానే జరుగుతుందని, అలా అని ప్రజలు భయపడాల్సిన పనిలేదని, కరోనా కూడా తగ్గుతుందని జగన్ చెప్పే ప్రయత్నం చేసారని అంటున్నారు. ఇక దాన్ని కూడా రాజకీయంగా వాడేసుకోవాలని టీడీపీ చూస్తోందని, ఇది ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు. పైగా తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయని ఉదాహరణగా చెబుతున్నారని, అక్కడ కరోనా టెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయని, కానీ ఏపీలో దాదాపు 80 వేలకు పైనే టెస్టులు చేసారని చెబుతూ టీడీపీ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: