ఏపీలో కరోనాపై అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో ఫెయిల్ అయిందని టీడీపీ అంటుంటే, హైదరాబాద్ లో కూర్చుని మాటలు చెప్పడం కాదని వైసీపీ అంటుంది. కరోనా కేసులు దాస్తోందని టీడీపీ నేతలు విమర్సలు చేస్తుంటే, వారివి అర్థంపర్ధం లేని విమర్సలు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

 

అయితే ఈ మాటల యుద్ధంలో భాగంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీపై తీవ్ర విమర్సలు చేశారు. టీడీపీ నేతలు తిన్నది అరగక 12 గంటలు దీక్షలు చేస్తున్నారని, ఏ ఒక్క టీడీపీ నేత అయినా ప్రజలకు సహాయం చేసారని, ఇంకా కర్నూలు ఎంపీ ఇంట్లో నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారని మాట్లాడారు.

 

ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ వాళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తిన్నది అరగక దీక్షలు చేయడం లేదని, కడుపునిండా అన్నం తినలేకపోతున్న పేదల కోసం చేస్తున్నామని అంటున్నారు. పేదవాడి కడుపు నిండే అన్న క్యాంటీన్లని తెరిపించడానికి, రైతుల సాయం కోసం, పేదవారికి రూ.5 వేలు ఇవ్వాలని చెబుతూ దీక్షలు చేస్తున్నామని, అందులో ఉపయోగం లేని డిమాండ్ ఏదో చెప్పాలని అంటున్నారు. కరోనా వచ్చిన డాక్టర్లని అవమానించలేదని, మీ వల్లే వారికి కరోనా వచ్చిందని చెబుతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

 

ఇంకా ఇంట్లో ఎవరూ కూర్చోవడం లేదని, తమ అధినేత ఆదేశాల మేరకు ప్రతి టీడీపీ నేత, ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సాయం చేస్తున్నారని, తమ సాధ్యమైన వరకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌ లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని, ఇంద్రభవనంలో ఎంజాయ్‌ చేస్తూ... బోర్‌ కొట్టినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

 

ఇంద్రభవనంలో ఉన్నప్పుడు, లాక్ డౌన్ ఎలా ఉల్లఘింస్తారని చెబుతూ శ్రీకాంత్ లాజిల్ లేని విమర్సలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎవరు లాక్ డౌన్ ఉల్లఘించి, కరోనా పెరగడానికి కారణం అవుతున్నారో ప్రజలకు తెలుసు అంటున్నారు. ఏదేమైనా వైసీపీ నేతలు విమర్సలు చేసేప్పుడు లాజిక్ మిస్ అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: