కరోనాని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు గ్యాప్ లేకుండా ప్రతిరోజూ జగన్ లక్ష్యంగా విమర్సలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు నుంచి చోటా నేత వరకు మీడియా సమావేశం పెట్టడం లేదా సోషల్ మీడియా వేదికగా జగన్ పై ఓ ఫైర్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై కొన్ని లేఖస్త్రాలు సంధిస్తున్నారు. కొన్ని సమస్యలని ఎత్తి చూపుతూ, బాబు లేఖలు రాస్తున్నారు.

 

అటు కొందరు టీడీపీ నేతలు కూడా కొన్ని కొన్ని సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. అయితే ఈ లేఖల రాజకీయంలోకి నారా లోకేష్ కూడా మొదలుపెట్టారు. అయితే పలు సమస్యలపై ఈ మధ్య లోకేష్, జగన్ కు లేఖలు రాసారు. ఇక తాజాగా రైతుల సమస్యలు పరిష్కరించాలని లోకేష్ లేఖ రాస్తూనే, విమర్సలు కూడా చేశారు. రైతుల సమస్యలని జగన్ పట్టించుకోవడం లేదని మాట్లాడారు.

 

ఇక దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ....వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్‌ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని చెబుతున్నారు. అలాగే రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని, దళారి వ్యవస్థకు చెక్ పెడుతూ, గిట్టుబాటు ధర కూడా అందేలా చేస్తున్నామని వివరిస్తున్నారు.

 

అయినా లోకేష్ వ్యవసాయం గురించి మాత్రం లేఖలు రాయడం కామెడీగానే ఉందని, అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసని లేఖలు రాస్తున్నారని మండిపడుతున్నారు. పైగా లోకేష్ కు తెలుగు కూడా సరిగా రాదు, ఎవరో స్క్రిప్ట్ టైప్ చేసిస్తే ప్రభుత్వానికి పంపేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు ఇలాంటి లేఖలు చినబాబుతో కాకుండా టీడీపీలోనే వ్యవసాయం తెలిసిన నేతలతో రాయిస్తే బెటర్ ఏమో అని సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: