కరోనా వైరస్ పరీక్షల విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని రోజుల నుండి మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రోజు ప్రకటనలు చేస్తూనే ఉంది. అదేవిధంగా కరోనా వైరస్ రాష్ట్రంలో త్వరగా కట్టడి చేయడానికి టెస్టులు సామర్థ్యాన్ని కూడా పెంచడానికి ఏపీ ప్రభుత్వం శతవిధాల కృషి చేస్తోంది. ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమందికి కరోనా వైరస్ పరీక్షలు ప్రభుత్వం చేసిందో పార్టీ లెక్కలను బయట పెడుతూ అధికారులు తెలియజేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో పరీక్షలు ఈ విధంగా పెంచడం కరెక్టేనా ? లేకపోతే తగ్గించాలా ? అనే కన్ఫ్యూజన్ ప్రజలలో దోబూచులాడుతుంది. ఎందుకంటే ఉన్న కొద్దీ రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో ఇళ్లలో ఉన్న ప్రజలకు భయమేస్తోంది. ఇటువంటి సమయంలో మరోపక్క బాధితులను త్వరగా గుర్తించేందుకు పరీక్షలు పెంచడం అనేది చాలా కరెక్ట్ అని వైద్యులు అంటున్నారు.

 

అందువల్లే ఏపీ ప్రభుత్వం టెస్టుల సామర్ధ్యాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్న తరుణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. ఎలా పరీక్షలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు గుర్తించడం వాళ్ళ ఆయా ప్రాంతాలపై ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రస్తుతం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం అనేది చాలా కరెక్ట్ అని వైద్యులు అంటున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: